• తాజా వార్తలు

30 రోజుల్లో రీఛార్జ్ చేసుకోకపోతే ఎయిర్‌టెల్, వొడాఫోన్ మన కాల్స్ బ్లాక్ చేస్తున్నాయా ?

2016లో జియో లాంచ్ అయినప్పటి నుంచి ఇతర నెట్ వర్క్ లయిన ఎయిర్‌టెల్, వొడాఫోన్  నుండి లక్షల మంది కస్టమర్లు జియోకి తరలివెళ్లిన సంగతి అందరికీ విదితమే. జియో అందించే ఉచిత ఆఫర్లను అందుకోవడానికి వీరంతా జియోకి తరలివెళ్లారు. ఇలా ఒక్కసారిగా తమ కస్టమర్లు ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్లడం అలాగే జియో వాయిస్ కాల్స్ ఉచిత డేటాను అందించడంతో టెల్కోలు భారీగా నష్టపోయాయి. జియో దెబ్బకు ఈ టెల్కోలు కూడా టారిఫ్ ప్లాన్లు అలాగే కాంబో ప్లాన్లను ప్రవేశపెట్టి జియోకి పోటీగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ దిగ్గజ టెల్కోలు మినిమం రీఛార్జ్ తో కొన్ని ప్లాన్లను అందిస్తున్నాయి. టారిఫ్ ప్లాన్ల వ్యాలిడిటీ అయిపోయిన తరువాత మీ ఫోన్లో మినిమం బ్యాలన్స్ లేకుంటే అవి ఇక పనిచేయవనే వార్తలు వస్తున్నాయి. 

మినిమం రీఛార్జ్ ప్లాన్స్
ఇకపై ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంపెనీల యూజర్లు మినిమం బ్యాలన్స్ లేకుంటే కనెక్షన్ యాక్టివ్ గా ఉండదు. ఈ రకమైన నిబంధనను తొలిసారిగా ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంపెనీలు ప్రవేశపెట్టాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్ మెర్జ్ అయిన తరువాత Rs. 35, Rs. 65 and Rs. 95 ప్యాక్ లతో మినిమం రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఈ ప్లాన్లన్నీ 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చాయి.మినిమం ప్లాన్ రూ.35తో 28 రోజుల పాటు టాక్ టైం అలాగే డేటాను అందించనున్నాయి. 

ఎందుకు ఇలా ప్రవేశపెట్టాయి ?
ఎయిర్‌టెల్, వొడాఫోన్ కంపెనీలు ఈ మినిమం రీఛార్జ్ ప్లాన్లు కనుక వాడకుంటే వారి యొక్కఅవుట్ గోయింగ్ కాల్స్ 30 రోజులు పాటు బ్లాక్ అవుతాయి. అలాగే 45 రోజుల పాటు ఇన్ కమింగ్ కాల్స్ బ్లాక్ అవుతాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. యూజర్లు సెకండ్ సిమ్ కింద ఈ సిమ్ వాడుతుండటం వల్ల కంపెనీలు భారీగా రెవిన్యూను కోల్పోతున్నాయి. రిలయన్స్ జియో కస్టమర్లు సెకండ్ సిమ్ కింద మిగతా నెట్ వర్క్ సిమ్ లు వాడుతుంటడంతో ఈ కంపెనీలు ఈ రకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

జన రంజకమైన వార్తలు