• తాజా వార్తలు

రోజుకు 3జిబి డేటా అందించే కంపెనీల్లో బెస్ట్ ఏదో తెలుసుకుందాం

దేశీయ టెలికాం రంగంలో డేటా వార్ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. దేశీయ టెలికాం రంగం జియో రాక జియో వచ్చిన తరువాత అన్న చందంగా తయారైంది. జియో రాకముందు ఆకాశంలో ఉన్న డేటా టారిఫ్ ధరలు ఒక్కసారిగా నేలవైపు చూశాయి. జియోతో పోటీపడుతూ దిగ్గజాలు కూడా ఇప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో రోజుకు 3జిబి డేటా అందించే కంపెనీల్లో ఏది బెస్ట్ అనే దానిపై మీకు కొన్ని వివరాలను అందిస్తున్నాం. ఓ సారి చెక్ చేయండి.

జియో రూ.299 ప్లాన్
జియో రూ.299 ప్లాన్ రీఛార్జి చేసుకునే యూజర్లకు రోజుకి 3జీబీ డేటాను అందిస్తోంది . అంతేకాకుండా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనంగా లభిస్తాయి.అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .దీంతో పాటు జియో టీవీ,జియో మనీ వంటి యాప్స్ కూడా జియో కంపెనీ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కింద అందిస్తోంది.

ఎయిర్‌టెల్ రూ.349
ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్ రీఛార్జి చేసుకునే యూజర్లకి రోజుకి 3జీబీ డేటాను అందిస్తోంది . అంతేకాకుండా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనంగా లభిస్తాయి.అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.అంతే కాకుండా ఎయిర్‌టెల్ టీవీ యాప్ కు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తోంది.

వోడాఫోన్ రూ.349
వోడాఫోన్ రూ.349 ప్లాన్ రీఛార్జి చేసుకునే యూజర్లకి రోజుకి 3జీబీ డేటాను అందిస్తోంది . అంతేకాకుండా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం.అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.అంతే కాకుండా వోడాఫోన్ ప్లే యాప్ కు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.

జన రంజకమైన వార్తలు