జియో రాకతో దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న సంగతి అందరికీ విదితమే. ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియోల మధ్య టారిఫ్ వార్ నువ్వా నేనా అన్నట్లుగా నడుస్తోంది. ముఖ్యంగా ప్రీపెయిడ్ ప్లాన్లలో పోటీలు పడుతూ యూజర్లకు ఆఫర్లను అందిస్తున్నాయి. దేశంలోకి 4జీ వచ్చిన తరువాత 1జిబి డేటా చాలా తక్కువ ధరకే లభిస్తుంది. అయితే ఈ డేటా వినియోగదారులకు సరిపోవడం లేదనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరింత డేటాను అందించే ప్యాక్ ల కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. వాయిస్ కాల్స్్, అలాగే డేటా, ఎస్మెమ్మస్ లు అత్యంత తక్కువ ధరలో ఎక్కువగా ఏ టెలికాం అందిస్తుందని వెతుకుతున్నారు. అలాంటి వారికోసం మార్కెట్లో ఉన్న బెస్ట్ ఫ్రీపెయిడ్ ప్లాన్లు, తక్కువ ధరలో అందించే కంపెనీల వివరాలను అందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.
ఎయిర్‌టెల్
రూ. 399 ప్లాన్
84 రోజుల పాటు రోజుకు 1జీబీ 3జీ లేదా 4జీ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది.
రూ.448 ప్లాన్
రూ.448తో రీఛార్జ్ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 1.5జీబీ డేటాను, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 82 రోజులు.
రూ.499 ప్లాన్
రూ.499తో రీఛార్జ్ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 2జీబీ డేటాను, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 82 రోజులు.
రూ.1699 ప్లాన్
రూ.1699తో రీఛార్జ్ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 1జీబీ డేటాను, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు.
వొడాఫోన్
రూ. 398 ప్లాన్ లో 69 రోజుల పాటు రోజుకు 1.4జీబీ 3జీ లేదా 4జీ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. రూ.399 ప్లాన్ లో 1జిబి డేటా, రూ.458లో 1.5జిబి డేటా, రూ.479లో 1.6జిబి డేటా,రూ.511లో 2జిబి డేటా,రూ.569లో 3జిబి డేటా ఫర్ డే చొప్పున అందిస్తోంది. అలాగే అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ల వ్యాలిడిటి 84 రోజులు. కాగా ఈ మధ్య రూ.509 ప్లాన్ కూడా యాడ్ చేసింది. ఇందులో 90 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జిబి డేటాను అందిస్తోంది. అలాగే రూ.1699తో రీఛార్జ్ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 1జీబీ డేటాను, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు.
జియో
రూ. 349 ప్లాన్ లో 70 రోజుల పాటు రోజుకు 1.5జీబీ 4జీ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. అలాగే రూ. 398 ప్లాన్ లో 70 రోజుల పాటు రోజుకు 2జీబీ 4జీ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. దీంతో పాటు రూ. 399 ప్లాన్ లో 84 రోజుల పాటు రోజుకు 1.5జీబీ 4జీ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. అలాగే రూ. 448 ప్లాన్ లో 84 రోజుల పాటు రోజుకు 2జీబీ 4జీ డేటా, అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది.