దేశీయ టెలికం దిగ్గజం వొడాఫోన్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. యూజర్లకు రూ.499కే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ని అందిస్తోంది. మీరు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలని భావిస్తున్నట్లయితే వొడాఫోన్ కస్టమర్లకు సగం ధరకే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ పొందే అవకాశం అందుబాటులో ఉంది. వొడాఫోన్ ప్రిపెయిడ్ కస్టమర్లు రూ.999 కాకుండా రూ.499కే పొందొచ్చు.
ఈ ఆఫర్ జూన్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. దీని పేరు వొడాఫోన్ యూత్ ఆఫర్ ఆన్ ప్రైమ్. ఈ ఆఫర్ పొందాలంటే వొడాఫోన్ సబ్‌స్క్రైబర్ల వయసు 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే కొత్త కొత్త సినిమాలతోపాటు, అమెజాన్‌లో కొనుగోలు చేసిన ప్రొడక్టులను త్వరితగతిన డెలివరీ పొందొచ్చు. అలాగే ఎక్స్‌క్లూజివ్ డీల్స్‌ను ముందుగానే పొందొచ్చు.
ఇక భారతీ ఎయిర్‌టెల్ కూడా తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో పలు మార్పులు చేసింది. ఇకపై రూ.399 కు బదులుగా వినియోగదారులకు రూ.499 ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఇందులో కస్టమర్లకు 75 జీబీ డేటా, అన్‌లిమిడెట్ లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ కింద మూడు నెలల నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, ఏడాది పాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్, జీ5 సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ టీవీ ప్రీమియం, హ్యాండ్ ప్రొటెక్షన్ సర్వీస్‌లు లభిస్తాయి.
ఎయిర్‌టెల్ రూ.749 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 125 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, పైన చెప్పిన ఎయిర్ టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ సేవలు అన్నీ లభిస్తాయి. అలాగే రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 150 జీబీ డేటా, రూ.1599 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ డేటా లు వస్తాయి. అలాగే ఎయిర్‌టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ సేవలు అన్నీ లభిస్తాయి.