• తాజా వార్తలు

రూ.100లోపు ఉన్నరీఛార్జ్ ప్లాన్లలో ఏది బెటర్ ?

ఒకానొక సమయంలో మొబైల్ డేటాను చాలా పొదుపుగా ఆచితూచి వాడుకోవల్సి వచ్చేది. జియో రాకతో ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. జియో ఉచిత డేటా ఆఫర్లు మార్కెట్‌ను ముంచెత్తటంతో పోటీని తట్టుకునేందుకు ఎయిర్‌టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు రూ.100లోపే ఆసక్తికర డేటా ప్లాన్లను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ఆఫర్లతో పాటు మరికొన్ని అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా రూ.100 బడ్జెట్‌లో మార్కెట్లో సిద్థంగా ఉన్న బెస్ట్ డేటా ప్లాన్స్ వివరాలను తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ రూ. 98 ప్లాన్ 
భారతీ ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న అత్యుత్తమ డేటా ప్లాన్‌లలో రూ.98 డేటా ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్‌లో భాగంగా 28 రోజులకు 3జీబి 2G/3G/4G డేటాను ఆస్వాదించే వీలుంటుంది. మొబైల్ డేటా పై ఎక్కువుగా ఆధారపడే యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది. అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్ నెలరోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ మీద ఎటువంటి అదనపు ప్రయోజనాలు అంటే ఎయిర్ టెల్ టీవి యాప్ ద్వారా అందే ప్రయోజనాలు ఉండవు. 
వొడాఫోన్ రూ. 98 ప్లాన్ 
ఈ ప్లాన్‌లో భాగంగా 28 రోజులకు 3జీబి 2G/3G/4G డేటాను ఆస్వాదించే వీలుంటుంది. అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్ నెలరోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ మీద ఎటువంటి అదనపు ప్రయోజనాలు అంటే వొడాఫోన్ ప్లే యాప్ ద్వారా అందే ప్రయోజనాలు ఉండవు. కాలింగ్ లో పరిమితి ఉంటుంది.
జియో రూ. 98 ప్లాన్ 
ఈ ప్లాన్‌లో భాగంగా 28 రోజులకు రోజుకు 2జీబి 4G డేటాను ఆస్వాదించే వీలుంటుంది. మొబైల్ డేటా పై ఎక్కువుగా ఆధారపడే యూజర్లకు ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది. అలాగే అన్ లిమిటెడ్ కాలింగ్ నెలరోజుల పాటు అందుబాటులో ఉంటుంది. 300 ఎసెమ్మెస్ లు ఉచితం. ఈ ప్లాన్ మీద జియో  అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. జియో యాప్స్ అన్నీ ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. అయితే ఈ ప్లాన్లో daily FUP limit ఉంటుంది. అది దాటితే ఇంటర్నెట్ స్పీడ్ 64Kbpsకి పడిపోతుంది. కాబట్టి బూస్టర్ ప్యాక్ రూ.101 వేసుకోవాల్సి ఉంటుంది. 
 

జన రంజకమైన వార్తలు