ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ ల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి బీఎస్సెన్నెల్ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. సరికొత్త ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా డాటా వినియోగానికి సంబంధించిన ఆఫర్లను ప్రకటిస్తోంది.
రూ.444కే..
డాటా వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ తన ప్రీ పెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం సరికొత్త డేటా ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ లో 444 రూపాయలతో రీఛార్జ్ చేసుకునే ప్రీపెయిడ్ వినియోగదారులకు 90 రోజులపాటు 3జీ వేగంతో ప్రతి రోజూ 4 జీబీ డాటాను అందించనుంది.
ఇంతకంటే పెద్ద ఆఫర్ లేనేలేదు
ఈ ఆఫర్ కారణంగా వినియోగదారులు రోజు వారీ డేటా ఒక జీబీ కోసం రూపాయి కంటే తక్కు చెల్లిస్తారని సంస్థ అంటోంది. ఇతర సంస్థలు రోజూ 2 జీబీ మాత్రమే అందిస్తుండగా, బీఎస్ఎన్ఎల్ 4 జీబీ 3జీ డేటా అందించడం విశేషం. దీంతో డేటా ఆఫర్లలో ఇదే బిగ్గెస్ట్ ఆఫర్ అని బీఎస్ఎన్ఎస్ బల్లగుద్ది మరీ చెప్తోంది.