ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్.. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రైవేట్ రంగ టెల్కోలతో పోటీ పడేందుకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని వినియోగించుకుంటోంది. కొత్త ప్లాన్ల అవిష్కరణతోపాటు ప్రస్తుత ప్లాన్లను సవరిస్తోంది. అలాగే బండిల్ ఆఫర్లు కూడా ప్రకటిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ రీఛార్జ్ ప్లాన్ కింద వినియోగదారులు 365 రోజుల వరకు రోజుకు 1.5GB డేటా బెనిఫెట్ పొందవచ్చు.
ఏడాది కాలపరిమితితో (365 వాలిడిటీ) కొత్త రీచార్జ్ ప్లాన్ ఆవిష్కరించింది. దీని ధర రూ.1,345. ఈ ప్లాన్ ప్రస్తుతం కేరళ సర్కిల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రమోషనల్ ఆఫర్ లో భాగంగా సెప్టెంబర్ 19వరకు లిమిటెడ్ పిరియడ్ తో అందుబాటులో ఉండనుంది. తర్వలోనే ఇతర సర్కిళ్లలోనూ అందుబాటులోకి రావొచ్చు. అయితే ఇది కేవలం డేటా ప్లాన్. ఇందులో ఎలాంటి ఉచిత కాలింగ్ సదుపాయం ఉండదు. అలాగే ఎస్ఎంఎస్ ప్రయోజనాలు కూడా లభించవు. బేస్ ప్లాన్ ఆధారంగానే చార్జీలు ఉంటాయి.
ఇటీవల BSNL కొత్త టారిఫ్ వోచర్ ను ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ రోమింగ్ సర్వీసుల కోసం Rs 168 స్పెషల్ టారిఫ్ వోచర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు. Rs 168STV తో 90 రోజుల వరకు వ్యాలిడెటీ ఉంటుంది. కానీ, ఈ ఆఫర్ లో నో కాలింగ్, డేటా లేదా SMS బెనిఫెట్స్ పొందవచ్చు. BSNL కేరళ వెబ్ సైట్ ప్రకారం.. రూ.1,345 రీఛార్జ్ వోచర్ తో రోజుకు 1.5GB డేటాతో పాటు అదనంగా 10GB డేటాను రిజర్వ్ చేసుకోవచ్చు. ఆ రోజులో డేటా లిమిట్ దాటితే రిజర్వ్ డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ఆఫర్ కింద యూజర్లు మొత్తం మీద 557.5GB డేటా వరకు పొందవచ్చు.
దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లందరికీ జూలై 1 నుంచి రూ.349, రూ.399, రూ.499లతో 3 రకాల బ్రాడ్‌బాండ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
రూ.349 ప్లాన్‌లో కస్టమర్లు రోజుకు 2 జీబీ డేటా పొందొచ్చు. డేటా స్పీడ్ 8 ఎంబీపీఎస్‌గా ఉంటుంది. ప్లాన్ వాలిడిటీ ఒక నెల. 2 జీబీ డేటా అయిపోయిన తర్వాత స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. అలాగే ఈ ప్లాన్ ఎంచుకున్న యూజర్లకు ఎవరితోనైనాసరే రూ.600 విలువైన ఉచిత కాల్స్ పొందొచ్చు. బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో అపరిమిత ఉచిత కాలింగ్ సదుపాయ ఉంటుంది. అలాగే ఇతర నెట్‌వర్క్‌కు రాత్రి 10:30 నుంచి ఉదయం 6 గంటల వరకు కాల్స్ చేసుకోవచ్చు.
బీఎస్ఎన్ఎల్ రూ.399 ప్లాన్‌లో కూడా రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. కాలింగ్ బెనిఫిట్స్ మాత్రం మారతాయి. భారత్‌లో ఏ నెట్‌వర్క్‌కైనాసరే అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంటుంది. ఇక రూ.499 ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ సదుపాయం ఉంటుంది. రోజుకు 3 జీబీ డేటా పొందొచ్చు. 8 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా లభిస్తుంది. లిమిట్ అయిపోయిన తర్వాత స్పీడ్ 1 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది.
ఇకపోతే బీఎస్ఎన్ఎల్ ఇటీవలనే అభినందన్ 151 ప్లాన్‌ను ఆశిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్ కింద అపరిమిత కాలింగ్ పొందొచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ప్లాన్ వాలిడిటీ 180 రోజులు. 1 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ కొన్ని సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది.