ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ మార్కెట్లోకి సరికొత్త వ్యూహాలతో దూసుకుపోయేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా పాత ప్లాన్లను రివైజ్ చేస్తూ వెళుతోంది. రూ.98 ప్లాన్ లో భారీ మార్పులను చేసింది. అదనపు డేటాతో పాటు మరికొన్ని ప్రయోజనాలను ఈ ప్లాన్లో యాడ్ చేసినట్లు తెలుస్తోంది.టెలికాం టాక్ రిపోర్టు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. కాగా ఈ ప్లాన్ ను గతేడాది మేలో సునామి ఆఫర్ కింద రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్లాన్లో ఇంతకుముందు 1.5జిబి డేటా లభించేంది. ఇప్పుడు అది మరింా పెరిగింది.ఈ ప్లాన్ తో పాటు ఇతర టెల్కోల ప్లాన్లను కూడా ఓ సారి పరిశీలిద్దాం.
బిఎస్ఎన్ఎల్ రూ. 98 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిలీ 26 రోజులు. గతంలో ఉన్న 1.5 జిబికి అదనంగా 0.5జిబిని యాడ్ చేసింది. తద్వారా రోజుకు 2జిబి డేటాను యూజర్లు అందుకుంటారు. కాగా దీని వ్యాలిడిటీ 24 రోజులు. ఈ డేటా అయిపోయిన తర్వాత స్పీడే వేగం తగ్గుతుంది.
ఎయిర్‌టెల్ రూ.98 ప్లాన్
ఈ టెలికాం దిగ్గం కూడా ఇదే రకమైన ప్లాన్ ని ఆఫర్ చేస్తోంది. అయితే ఈ ప్లాన్లో 28 రోజుల పాటు యూజర్లు కేవలం 5జిబి డేటాను మాత్రమే పొందుతారు. దీంతో పాటు ఎటువంటి కాలింగ్ బెనిఫిట్స్ ఇందులో లేవు. యూజర్లు ఒక రోజులో 5జిబి డేటాను వాడుకోవచ్చు. లేకుంటే నెలంతా 5జిబి డేటాను వాడుకోవచ్చు. ఇది కేవలం అదనపు డేటా కావాలనుకున్న వారికి మాత్రమే ఉపయోగకరంగా ఉంటుంది.
రిలయన్స్ రూ.98 ప్లాన్
జియో కూడా ఇదే ధరలో ఓ ప్లాన్ ని ఆఫర్ చేస్తోంది. అయితే 28 రోజుల పాటు కేవలం 2జిబి డేటాను మాత్రమే జియో ఆఫర్ చేస్తోంది.అయితే ఇందులో ఉన్న ప్రయోజనం ఏమిటంటే నెల రోజుల పాటు అన్ లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే జియో యాప్స్ ని కూడా ఆఫర్ చేస్తోంది.