• తాజా వార్తలు

BSNL నుంచి ఉచితంగా హాట్‌స్టార్‌ ప్రీమియం, ప్లాన్ల వివరాలు మీ కోసం

ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ జియోతో పోటీ పడుతూ ఆఫర్లను ప్రకటిస్తూ పోతోంది. టెలికం ప్రపంచంలో పడుతూ లేస్తూ వస్తున్న ప్రభుత్వ రంగ దిగ్గజం bsnl ఈ మధ్య అనేక ఆఫర్లను ప్రకటించింది. తాజాగా బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులకు వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాం హాట్‌స్టార్‌ ప్రీమియం సర్వీసును ఉచితంగా అందిస్తోంది. ‘సూపర్‌స్టార్‌ 300’ పేరుతో ఫిక్సిడ్‌–లైన్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.749 నెలవారీ ప్యాక్‌లో భాగంగా సెకనుకు 50 మెగాబిట్‌తో 300 గిగాబైట్‌ డౌన్‌లోడ్‌ను అందిస్తోంది. ఆప్టికల్‌ ఫైబర్‌ కనెక్షన్‌ను ఉపయోగించే వినియోగదారులకు 2 MBPS స్పీడుతో అపరిమిత డేటాను ఇస్తోంది. నూతన ప్లాన్‌ ద్వారా హాట్‌స్టార్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ పొంది నాన్‌–స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్‌ స్పోర్ట్స్‌ సౌలభ్యాన్ని పొందవచ్చని వివరించింది.

కాగా కంపెనీ ఈ మధ్యనే కొత్త రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఇది ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్. దీని ధర రూ.168. మొబైల్ నెంబర్‌పై ఇంటర్నేషనల్ రోమింగ్ సర్వీస్‌ను పొందాలనుకునేవారు ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకోవచ్చు.  అలాగే కొత్త రీచార్జ్ ప్లాన్‌తో ఇంటర్నేషనల్ రోమింగ్ వాలిడిటీని కూడా పెంచుకోవచ్చు. ఇకపోతే రూ.168 ప్లాన్‌లో ఎలాంటి కాలింగ్, డేటా ప్రయోజనాలు లభించవు. ప్రస్తుతం ఈ ప్లాన్ కొన్ని సర్కిళ్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

అలాగే  డాటా సునామీ ప్లస్ పేరుతో అన్ లిమిటెడ్ డేటా ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ పరిధిలోకి రావాలంటే యూజర్లు రూ.318తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. 84 రోజుల కాలపరిమితి కలిగిన ఈ ఆఫర్‌లో రోజుకు 2 జీబీ డేటా లభించనున్నది. 2జీబీ డేటా అనంతరం ఇంటర్నెట్ వేగం 40 kbpsకి పడిపోనున్నది. 

వీటితో పాటుగా రూ.150 టాప్‌అప్‌పై 90 రోజుల వ్యాలిడిటీతో రూ.180 టాక్‌టైం, రూ.151 ప్లాన్‌ ద్వారా 28 రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్కులకు అపరిమిత ఫ్రీకాలింగ్‌ ను అందిస్తోంది. రోజుకు 3.2 జీబీ హైస్పీడ్‌ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఇందులో భాగంగా ఉంటాయి. రూ.298 ఓచర్‌ ద్వారా, ప్లాన్‌ రూ.328కు మారిన వారికి 90 రోజుల పాటు దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్‌, 300 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. 180 రోజుల ప్లాన్‌ వ్యాలిడిటీని ఇందులో పొందవచ్చు. ఇతర వివరాలకు సమీప కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌లో సంప్రదించాలని BSNL తెలిపింది. 
 

జన రంజకమైన వార్తలు