• తాజా వార్తలు

జియో ఫైబర్ డేటా ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు ఎంత, ప్రాసెస్ ఏంటీ ?

మొబైల్ డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ఫైబర్ సర్వీసుతో మళ్లీ దూసుకురానున్న సంగతి తెలిసిందే. జియో ఫైబర్ సర్వీసును సెప్టెంబర్ 5న అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్టు ముకేష్ అంబానీ ప్రకటించారు. FTTH సర్వీసులో భాగంగా హైస్పీడ్ ఇంటర్నెట్, జియో గిగాఫైబర్ కనెక్షన్ అందించనున్నట్టు తెలిపారు. దీంతో పాటుగా జియో ఫైబర్ కనెక్షన్ యానివల్ ప్లాన్లు తీసుకున్న యూజర్లకు వెల్ కమ్ ఆఫర్ కింద  4K LED TV, 4K సెటప్ టాప్ బాక్స్ కూడా ఫ్రీగా ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించారు. 

ఫైబర్ కనెక్షన్ కు ఎలాంటి ఇన్ స్టాలేషన్ ఛార్జీలు లేవని, ఉచితంగా సర్వీసును అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. రిలయన్స్ జియో ఫైబర్ కనెక్షన్లు ఇప్పటికే ప్రారంభం కాగా ఇప్పటివరకూ 1.5కోట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించి దరఖాస్తులు అందాయి. జియో ఫైబర్ కనెక్షన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఓసారి చూడండి. 

జియో ఫైబర్ కనెక్షన్ పొందాలంటే : 
జియో ఫైబర్ సర్వీసు కనెక్షన్ పొందాలంటే కస్టమర్లు జియో కంపెనీ వెబ్ సైట్ Jio Fiber New Connection విజిట్ చేయాల్సి ఉంటుంది. అందులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాగానే జియో ఫైబర్ కంపెనీ ఇంజినీర్ మీరు ఉండే ప్రాంతాన్ని పరిశీలించి మీ ఇంట్లో జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసును ఇన్ స్టాల్ చేస్తారు. రెండు నుంచి మూడు గంటల్లో మీ ఫైబర్ కనెక్షన్ యాక్టివేట్ అవుతుంది. జియో ప్రివ్యూ ఆఫర్ కింద జియో గిగాఫైబర్ సర్వీసు పొందాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2వేల 500 చెల్లించాల్సి ఉంటుంది. జియో రూటర్ కూడా ఉచితంగా పొందవచ్చు. 

ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు
జియోఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్లకు ఉచితంగా ఇన్ స్టాలేషన్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా కస్టమర్లు ఉచితంగా ల్యాండ్ లైన్ కనెక్షన్ కూడా పొందవచ్చు. కొత్త కనెక్షన్ తీసుకున్న యూజర్లందరి కోసం కాంప్లిమెంటరీ జియోఫైబర్ ఇన్ స్టాలేషన్, కనెక్షన్ ఆఫర్ అందిస్తోంది. రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ మినహా అదనంగా ఇన్ స్టాలేషన్ చార్జీలు ఉండవని జియో ఒక ప్రకటనలో తెలిపింది. 

 డేటా ప్లాన్ల ధరలు 
జియో ఫైబర్ డేటా ప్లాన్లలో ప్రారంభ ధర నెలకు రూ.700 నుంచి రూ.10వేల వరకు ఉన్నాయి. 
కస్టమర్లు నెలకు రూ.700తో డేటా ప్లాన్ తీసుకుంటే 100Mbps హైస్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.
ప్రీమియం యూజర్లు రూ.10వేల డేటా ప్లాన్ తీసుకుంటే 1Gbps హైస్పీడ్ డేటా యాక్సస్ చేసుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు