• తాజా వార్తలు

రోజుకు 1.5 జిబి డేటాను అందించే జియో టాప్ 5 ప్లాన్లు మీకోసం

హైస్పీడ్ డేటా నెట్ వర్క్ ఏదంటే.. ముందుగా గుర్తుచ్చే మొబైల్ డేటా నెట్ వర్క్ రిలయన్స్ జియోనే కదా. ఇతర టెలికం ఆపరేటర్ల కంటే తక్కువ ఖరీదుకే హైస్పీడ్ డేటా ప్లాన్లు అందిస్తూ టాప్ రేంజ్ లోకి దూసుకెళ్లింది. ఇందులో భాగంగానే యూజర్లకు రూ.149 ప్రారంభ ధరతో రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తోంది. రోజుకు 1.5జీబీ డేటాతో హైస్పీడ్ డేటాను అందించే పలు ఆఫర్లలో టాప్ 5 రీఛార్జ్ డేటా ప్లాన్లు, బెనిఫెట్స్ ఏంటో ఓసారి చూద్దాం.

రూ.149 రీఛార్జ్ ప్యాక్ : 
జియో అందించే టాప్ రీచార్జ్ డేటా ప్లాన్లలో ప్రారంభ డేటా ప్లాన్లలో రూ. 149 ఒకటి. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే చాలు.. జియో యూజర్లు రోజుకు 1.5GB హైస్పీడ్ డేటా పొందవచ్చు. అంతేకాదు.. ఫ్రీ లోకల్ కాల్స్, STD వాయిస్ కాల్స్, అన్ లిమిటెడ్ SMS (రోజుకు 100) 28 రోజుల కాలపరిమితి పొందవచ్చు. ఈ ప్లాన్ కు సంబంధించి వివరాల కోసం జియో టెలికం కంపెనీ వెబ్ సైట్ jio.com ను విజిట్ చేయండి.

రూ.349 ప్లాన్: 
ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు. ఈ ప్లాన్ కింద కూడా రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటాను పొందొచ్చు. ఇక అపరిమిత ఉచిత కాల్స్, ఎస్ఎంఎస్ (రోజుకు 100) వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఈ ప్లాన్ కు సంబంధించి వివరాల కోసం జియో టెలికం కంపెనీ వెబ్ సైట్ jio.com ను విజిట్ చేయండి.

రూ.399 ప్లాన్: 
ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. రూ.399తో రీచార్జ్ చేసుకుంటే ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా పొందొచ్చు.ఈ ప్లాన్ కు సంబంధించి వివరాల కోసం జియో టెలికం కంపెనీ వెబ్ సైట్ jio.com ను విజిట్ చేయండి.

రూ.449 ప్లాన్: 
ప్లాన్ వాలిడిటీ 91 రోజులు. రూ.449తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా వస్తుంది. అపరిమిత ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్‌లు (రోజుకు 100) ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్ కు సంబంధించి వివరాల కోసం జియో టెలికం కంపెనీ వెబ్ సైట్ jio.com ను విజిట్ చేయండి.

రూ.1,699 ప్లాన్: 
ఈ ప్లాన్ తీసుకుంటే ఏడాది పాటు హైస్పీడ్ డేటా, అపరిమిత కాల్స్, ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా వస్తుంది.ఈ ప్లాన్ కు సంబంధించి వివరాల కోసం జియో టెలికం కంపెనీ వెబ్ సైట్ jio.com ను విజిట్ చేయండి.

జన రంజకమైన వార్తలు