• తాజా వార్తలు

జియో పూర్తి ఆఫర్లు, డేటా ప్యాకేజీ వివరాలు, మొత్తం 12 రకాల ప్లాన్లు మీకోసం 

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం రిలయన్స్ జియో యూజర్ల కోసం వివిధ రకాల డేటా ప్యాకేజీలను ఆఫర్ చేస్తోంది. ఇందులో రోజుకు 1.5GB డేటా మొదలు 5GB డేటా వరకు మొత్తం 12 రకాల రీచార్జ్ ప్లాన్స్ ఉన్నాయి. వీటితో పాటు వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌ల వెసులుబాటు కూడా ఉంది. ఈ శీర్షికలో భాగంగా రూ.149 ప్లాన్ మొదలు వివిధ రకాల ప్లాన్ల గురించి తెలుసుకుందాం.

జియో 1.5GB డేటా ప్లాన్ 
రిలయన్స్ జియో రూ.149 నుంచి రూ.1,699 వరకు 5 రకాల రీచార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. ఇందులో రోజుకు 1.5GB డేటా వినియోగించుకోవచ్చు. రీచార్జ్ ప్లాన్ పెరిగిన కొద్దీ కాలపరిమితి (టైమ్ పీరియడ్) పెరుగుతుంది. 
రూ.149 రీచార్జ్ ప్లాన్: ఈ ప్లాన్‌తో రోజుకు 1.5GB డేటా వినియోగించుకోవచ్చు. 28 రోజుల కాలపరిమితి ఉంది. అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉంటాయి. జియో మొబైల్ అప్లికేషన్ కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ ఉంది. 
రూ.349 రీచార్జ్ ప్లాన్: రూ.149తో వచ్చే అన్ని సౌకర్యాలు రూ.349 ప్లాన్‌లో ఉంటాయి. టైమ్ పీరియడ్ 70 రోజులుగా ఉంటుంది. 
రూ.399 రీచార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ టైమ్ పీరియడ్ 84 రోజులు. 
రూ.499 రీచార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ టైమ్ పీరియడ్ 91 రోజులు. -
రూ.1,699 రీచార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ టైమ్ పీరియడ్ ఏడాది (365 రోజులు).

జియో 2GB డేటా ప్లాన్ 
రిలయన్స్ జియో రూ.198 నుంచి రూ.498 మధ్య 4 రకాల రీచార్జ్ ప్లాన్స్ అందిస్తోంది. వీటితో రోజుకు డేటా ప్యాకేజీ 2GB పొందవచ్చు. రీచార్జ్ ప్లాన్ పెరిగిన కొద్దీ కాలపరిమితి (టైమ్ పీరియడ్) పెరుగుతుంది. 
రూ.198 రీచార్జ్ ప్లాన్: ఈ ప్లాన్‌తో రోజుకు 2GB డేటా వస్తుంది. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు. జియో మొబైల్ అప్లికేషన్ సబ్‌స్క్రిప్షన్ ఉంటుంది. ఈ ప్లాన్ టైమ్ పీరియడ్ 28 రోజులు.
రూ.398 రీచార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ కింద పైన పేర్కొన్న ప్రయోజనాలు ఉంటాయి. టైమ్ పీరియడ్ మాత్రం 70 రోజులుగా ఉంటుంది. 
రూ.448 రీచార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ కాలపరిమితి 84 రోజులు. ఈ ప్లాన్ కింద పైన పేర్కొన్న ప్రయోజనాలు ఉంటాయి. 
రూ.498 రీచార్జ్ ప్లాన్: ఈ ప్లాన్ టైమ్ పీరియడ్ 91 రోజులు.ఈ ప్లాన్ కింద పైన పేర్కొన్న ప్రయోజనాలు ఉంటాయి. 

జియో 3GB డేటా ప్లాన్ 
రిలయన్స్ జియో రూ.299 నుంచి రూ.799 మధ్య 3 రకాల రీచార్జ్ ప్లాన్స్‌తో రోజుకు 3GB, 4GB, 5GB డేటాను అందిస్తోంది. ఇక్కడ మూడు రీచార్జ్ ప్లాన్స్‌కు టైమ్ పీరియడ్ 28 రోజులే. కానీ డేటా ప్లాన్ మారుతుంది. 
రూ.299 రీచార్జ్ ప్లాన్: ఈ ప్లాన్‌తో రోజుకు 3GB డేటా వస్తుంది. అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, జియో మొబైల్ అప్లికేషన్స్ సబ్‌స్క్రిప్షన్. ఈ ప్లాన్ టైమ్ పీరియడ్ 28 రోజులు. 
రూ.509 రీచార్జ్ ప్లాన్: ఈ ప్లాన్‌తో రోజుకు 4GB ఇంటర్నెట్ డేటా వస్తుంది. అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, జియో మొబైల్ అప్లికేషన్స్ సబ్‌స్క్రిప్షన్. ఈ ప్లాన్ టైమ్ పీరియడ్ 28 రోజులు. 
 రూ.799 రీచార్జ్ ప్లాన్: ఈ ప్లాన్‌తో రోజుకు 5GB ఇంటర్నెట్ డేటా వస్తుంది. అపరిమిత లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, జియో మొబైల్ అప్లికేషన్స్ సబ్‌స్క్రిప్షన్. ఈ ప్లాన్ టైమ్ పీరియడ్ 28 రోజులు.

జన రంజకమైన వార్తలు