జియో ప్రభావంతో ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ కి లాభాల పంట పండుతోంది. జియో టారిఫ్ ప్లాన్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు రిలయన్స్‌పై భారీ అంచనాలు పెట్టుకోవడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ వాటా అమాంతం పెరిగిపోతోంది. కేవలం గత ఆరువారాల్లోనే మార్కెట్ వాటాలో రూ.లక్ష కోట్ల వృద్ధి సాధించి, ఆ సంస్థ మార్కెట్ వాటా రూ. 4.44 లక్షల కోట్లకు చేరుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోన్న రిలయన్స్ జియో తాజాగా మరో ఆఫర్‌ను ప్రకటించింది. జియో సమ్మర్ సర్‌ప్రైజ్ పేరిట పలు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇటీవలే జియో ప్రైమ్ మెంబర్ షిప్ గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించి, 303 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే మూడు నెలలు ప్రయోజనాలు పొందవచ్చని తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆఫర్‌ను కొనసాగిస్తూనే మరిన్ని సౌలభ్యాలను కల్పించింది.
రూ.303తో రీచార్జి చేసుకుంటే 28 జీబీ 4జీ డేటా (రోజుకు 1 జీబీ డేటా), అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను ఒక నెలకు రీచార్జి చేసుకుంటే 3 నెలలు వాడుకోవచ్చు. అంతేగాక నెలకు అదనంగా 5 జీబీ 4జీ డేటా ఉచితంగా పొందవచ్చు.
ఇక ఇటువంటి కొత్త ఆఫర్లనే జియో మరికొన్ని తీసుకొచ్చింది. రూ.499తో రీచార్జి చేసుకుంటే 56 జీబీ 4జీ డేటా (రోజుకు 2 జీబీ డేటా), అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు.. ఒక నెలకు రీచార్జి చేసుకుంటే 3 నెలలు వాడుకోవచ్చు, దీనిలో నెలకు అదనంగా 10 జీబీ 4జీ డేటా కూడా ఉచితంగా పొందవచ్చు. రూ.999తో రీచార్జి చేసుకుంటే 60 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు 3 నెలల వాలిడిటీతో అదనంగా 100 జీబీ ఉచిత డేటాతో అందిస్తోంది. రూ.1999తో రీచార్జి చేసుకుంటే 125 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు 90 రోజుల కాల వ్యవధితో అందిస్తోంది. దీంతో అదనంగా 100 జీబీ ఉచిత డేటా కూడా పొందవచ్చు. రూ.4999తో రీచార్జి చేసుకుంటే 350 జీబీ 4జీ డేటా, అన్‌లిమిడెట్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ఆరునెలల వరకు పొందవచ్చు. ఇక రూ.9999తో రీచార్జి చేసుకుంటే 750 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాలిడిటీ 360 రోజుల వరకు పొందవచ్చు. ఈ ఆఫర్లకు కూడా అదనంగా 100 జీబీ ఉచిత డేటా అందిస్తోంది. కాగా, ఇంతకు ముందు ఉన్న ఆఫర్ రూ.149తో రీచార్జి ఆఫర్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. ఈ రీచార్జ్‌తో 2 జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ 28 రోజుల వరకు పొందవచ్చు.