• తాజా వార్తలు

ఆరు ప్లాన్లను సవరించిన బిఎస్ఎన్ఎల్, పూర్తి వివరాలు మీ కోసం

జియో గిగా ఫైబర్ బ్రాండ్ అతి త్వరలో దేశమంతా లాంచ్ కానున్న నేపథ్యంలో దిగ్గజ టెల్కోలు ఇప్పటి నుంచే సరికొత్త ప్లాన్లకు తెరలేపాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ భారీ ప్లాన్లతో దూసుకువచ్చింది. తన పాత FTTH Broadband ప్లాన్లను సవరించింది. Rs.777, Rs.1277,Rs 3,999, Rs 5,999, Rs 9,999 and Rs 16,999లలో భారీ మార్పులు చేర్పులు చేసింది. 

బిఎస్ఎన్ఎల్ రూ.1277 ప్లాన్ 
ఈ ప్లాన్లో ఇప్పుడు రోజుకు 25జిబి డేటాను ఆఫర్ చేస్తోంది. 100 ఎంబిపిఎస్ స్పీడు ఉంటుంది. పరిధి దాటిన తరువాత దాని వేగం 2 ఎంబిపిఎస్ కు పడిపోతుంది.

బిఎస్ఎన్ఎల్ రూ.3,999 ప్లాన్ 
ఈ కాంబో ప్లాన్లో ఇప్పుడు రోజుకు 50జిబి డేటాను ఆఫర్ చేస్తోంది. 100 ఎంబిపిఎస్ స్పీడు ఉంటుంది. పరిధి దాటిన తరువాత దాని వేగం 4 ఎంబిపిఎస్ కు పడిపోతుంది. 750 జిబి వరకు అదే స్పీడులో రన్ అవుతుంది.

బిఎస్ఎన్ఎల్ రూ.5,999 ప్లాన్ 
ఈ కాంబో ప్లాన్లో ఇప్పుడు రోజుకు 80జిబి డేటాను ఆఫర్ చేస్తోంది. 1250 జిబి వరకు 100 ఎంబిపిఎస్ స్పీడు ఉంటుంది. పరిధి దాటిన తరువాత దాని వేగం 6 ఎంబిపిఎస్ కు పడిపోతుంది. 

బిఎస్ఎన్ఎల్ రూ.9,999 ప్లాన్ 
ఈ కాంబో ప్లాన్లో ఇప్పుడు రోజుకు 120జిబి డేటాను ఆఫర్ చేస్తోంది. జిబి వరకు 100 ఎంబిపిఎస్ స్పీడు ఉంటుంది. పరిధి దాటిన తరువాత దాని వేగం 8 ఎంబిపిఎస్ కు పడిపోతుంది. 

బిఎస్ఎన్ఎల్ రూ.16,999 ప్లాన్ 
ఈ కాంబో ప్లాన్లో ఇప్పుడు రోజుకు 170జిబి డేటాను ఆఫర్ చేస్తోంది. 3500 జిబి వరకు 100 ఎంబిపిఎస్ స్పీడు ఉంటుంది. పరిధి దాటిన తరువాత దాని వేగం 8 ఎంబిపిఎస్ కు పడిపోతుంది. 

ఇదిలా ఉంటే     ఈ దిగ్గజం కొత్తగా రోజుకు 40 జిబి ప్లాన్ ను కూడా లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్లో 40జిబి డేటాతో పాటు 100 ఎంబిపిఎస్ స్పీడుతో కూడిన వేగం ఉంటుంది. దీని ధర రూ. 2,499. దీని పరిధి దాటిన తరువాత దాని వేగం తగ్గిపోతుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. 

జన రంజకమైన వార్తలు