టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో మరో రికార్డు నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. గిగా ఫైబర్ పేరిట త్వరలో బ్రాడ్‌బ్యాండ్‌సేవలను ప్రారంభిస్తున్నజియో దాని మీద అధికారికంగా ఎటువంటి ప్రకటన ఇవ్వకుండానే దానికి సంబంధించిన లీకులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం బీటా దశలో ఉన్న ఈ సేవల గురించి అప్పుడే పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రాథమికంగా బ్రాడ్ బాండ్ సేవలు రూ.600కే ఈ సేవలు యూజర్లకు అందుబాటులోకి వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కనెక్షన్ తీసుకున్న వారికి ప్రివ్యూ ఆఫర్ కింద ఉచితంగానే సేవలు అందిస్తున్నారు. కాకపోతే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.4,500 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించే మొత్తాన్ని జియో తగ్గించినట్లు వార్తలు వస్తున్నాయి. గతం కంటే రూ.2వేలు తక్కువగా అంటే రూ.2,500కే కనెక్షన్ అందిస్తున్నట్లు కొందరు వినియోగదారులు పేర్కొంటున్నారు. దీంతో పాటు తాజాగా అందిస్తున్న గిగా ఫైబర్‌లో కనెక్షన్‌లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
రూ.2500 కనెక్షన్‌తో సింగిల్ బ్యాండ్ రూటర్ మాత్రమే అందిస్తారు. అదే రూ.4,500 పెట్టి కొనుగోలు చేసే కనెక్షన్‌లో డ్యూయల్ బ్యాండ్ రూటర్‌తో అందిస్తున్నారు. ఇది 2.4GHz, 5GHz బ్యాండ్ విడ్త్‌ను సపోర్టు చేస్తుంది. రూ.4,500 కనెక్షన్‌తో పోలిస్తే ఈ కొత్త కనెక్షన్‌లో వేగం తక్కువగా ఉంటుంది. రూ.4,500 ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ వేగం అందిస్తుంటే.. కొత్త కనెక్షన్ కింద 50 ఎంబీపీఎస్ వేగం ఉంటుంది.అయితే ఈ చౌక ప్లాన్‌లో వాయిస్ సేవలు కూడా అందుతాయి.
దీని ద్వారా ఇతరులకు కాల్స్ కూడా చేసుకోవచ్చు. దీంతో పాటు జియో టీవీ యాప్‌ను కూడా అందిస్తున్నారు. అయితే, కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌కు సంబంధించి జియో నుంచి ఎలాంటి అధికారిక వెలువడలేదు. కానీ, కొందరు వినియోగదారులు, మీడియాలో వస్తున్న కథనాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు జియో వాణిజ్య సేవలు ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదానిపై ఇంకా సస్పెన్స్ నెలకొని ఉంది.