దేశీయ టెలికాం రంగంలో తిరుగులేకుండా దూసుకుపోతున్న టెలికం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ICC World Cup 2019 లైవ్ మ్యాచ్ లు చూసే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఇకపై పైసా చెల్లించాల్సిన అవసరం లేకుండా జియో యూజర్లంతా పూర్తి ఉచితంగా వరల్డ్ కప్ మ్యాచ్ లు చూడవచ్చు. దీంతో పాటు My Jio appపై ‘జియో క్రికెట్ ప్లే’ అనే మినీ గేమ్ ఆడటం ద్వారా కూడా యూజర్లు ఎన్నో ప్రైజ్ లు గెలుచుకోవచ్చు.
ఈ స్పోర్ట్స్ ప్యాక్ యాక్టివేట్ చేసుకోవాలంటే రూ.365 రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు రిలయన్స్ జియో సబ్ స్ర్కైబర్లు అన్ని వరల్డ్ కప్ 2019 మ్యాచ్ లను హాట్ స్టార్ నుంచి లైవ్ ద్వారా చూడవచ్చు. Hotstar విజిట్ చేయగానే జియో యూజర్లు అందరూ ఆటోమాటిక్ గా అన్ని వరల్డ్ కప్ మ్యాచ్ లను యాక్సస్ చేసుకోవచ్చు. Jio TV app ద్వారా యాక్సస్ చేసుకునే యూజర్లు హాట్ స్టార్ యాప్ కు రీడైరెక్ట్ అవుతారు.
దీంతో పాటు రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం కొత్త డేటా ప్యాక్ ప్రవేశపెట్టింది. అదే.. అన్ లిమిటెడ్ క్రికెట్ సీజన్ డేటా ప్యాక్. స్పోర్ట్స్ డేటా ప్యాక్ యాక్టివేట్ చేసుకోవాలంటే రూ.251తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ కింద 51 రోజుల పాటు రోజుకు 2 జీబీ డేటా చొప్పున మొత్తం 102 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఈ డేటా ప్లాన్ ద్వారా అన్ని ప్రపంచ క్రికెట్ మ్యాచ్ లను చూడవచ్చు. అంతేకాదు.. ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా చేయవచ్చు.
జియో క్రికెట్ ప్లేతో పాటు Mini Game రెండు ఆఫర్లను.. జియో యూజర్లతో పాటు ఇతర నెట్ వర్క్ యూజర్లు కూడా వినియోగించుకోవచ్చు. ఈ గేమ్ లో రియల్ టైం క్రికెట్ అప్ డేట్స్ కు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. దీనిద్వారా యూజర్లు క్రికెట్ పై తమ పరిజ్ఞానాన్ని చెక్ చేసుకోవచ్చు కూడా. ప్రస్తుతం ఈ మినీ గేమ్ యాప్.. కంపెనీ MyJio యాప్ లో అందుబాటులో ఉంది. ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి మినీ గేమ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
స్కోర్స్, మ్యాచ్ షెడ్యూల్స్, రిజల్ట్స్ తెలుసుకోవడంతో పాటు కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. ఈ గేమ్ జియో, నాన్ జియో సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం మైజియో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ బాల్, ప్రతీ ఓవర్, ప్రతీ మ్యాచ్‌కు ఏం జరుగుతుందో కాంటెస్ట్‌లో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా పాయింట్లు గెలుచుకోవచ్చు. ఎక్కువ పాయింట్స్ గెలిచినవారికి బహుమతులు ఉంటాయి.