అంతా ఎదురుచూస్తున్న జియో మాన్‌సూన్ హంగామా ఆఫర్ శనివారం(21వ తేదీ) నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఏ బ్రాండ్ ఫీచర్ ఫోన్ అయినా ఎక్స్ఛేంజ్ చేసుకుని, కేవలం రూ.501 చెల్లించి జియో ఫోన్‌ని పొందవచ్చు. గతంలో రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించి జియో ఫోన్‌ని సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు రూ.501కే ఫీచర్ ఫోన్ అందిస్తోంది జియో! మూడేళ్ల తర్వాత జియో ఫోన్ ఇచ్చేస్తే.. రూ. 501 రీఫండ్ ఇచ్చేస్తారు. ఈ జియో మాన్‌సూన్ హంగామా ఫోన్ తీసుకునేందుకు వెళ్లబోతున్నారా? మీఫోన్‌కి ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదోననే సందేహిస్తున్నారా? ఈ విషయాలు ఇక్కడ తెలుసుకోండి!
* లాక్ అయిపోయిన సీడీఎంఏ, జియో ఫోన్ తీసుకోరు.
* బ్యాటరీ, చార్జర్ మినహా ఫోన్‌కు సంబంధించిన ఇతర వస్తువులేమీ తీసుకోరు.
* ఎక్స్ఛేంజ్ చేయదలుచుకున్న ఫోన్ వర్కింగ్ కండీషన్‌లో ఉండాలి. ఎటువంటి డ్యామేజ్, కాలినట్లు ఉండకూడదు.
* సుమారు 3.5 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసుండాలి. 2015 జనవరి 1 తర్వాత విడుదలైన మోడల్ అయి ఉండాలి.
* nonVOLTE ఫోన్ అయి ఉండాలి.
* ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
* మొబైల్ నంబర్ మార్చుకునేందుకు(ఎంఎన్‌పీ) కొత్త MNP JIO number తీసుకోవాలి.
* ఈ మాన్‌సూన్ హంగామా ఆఫర్‌లో జియోఫోన్ రీచార్జ్ ప్లాన్‌లో భాగంగా రూ.594తో రీచార్జి చేసుకుంటే.. ఆరు నెలల వరకూ పనిచేస్తుంది. దీంతో పాటు స్పెషల్ ఎక్స్ఛేంజ్ బోనస్‌గా 6 జీబీ డేటాను అందించబోతోంది. దీంతో కలిపి మొత్తం ఆరు నెలలకు 90 జీబీ డేటా(రోజుకి 0.5జీబీ) వస్తుంది.