రిలయన్స్ జియో నుంచి మరో కొత్త ఆఫర్. మై వోచర్స్ అని తీసుకొచ్చిన కొత్త ఆఫర్లో భాగంగా వోచర్లను ఇప్పడు కొనుక్కుని తర్వాత వాడుకునే కొత్త
ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇండియన్ టెలికం సెక్టార్‌లో ఇలాంటి ప్రయోగం ఇదే తొలిసారి. వరుస ఫ్రీ ఆఫర్లు, తర్వాత జియో సమ్మర్ ఆఫర్, ధనాధన్
ఆఫర్లతో మొబైల్ యూజర్లను బాగా ఎట్రాక్ట్ చేసిన జియో కొత్త ఫీచర్‌తో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. మై జియో యాప్‌లో మై వోచర్స్ అనే కొత్త ఫీచర్
అందుబాటులోకి వచ్చింది. దీని లో 309, 509 రూపాయల రేంజ్‌లో రెండు కొత్త టారిఫ్ వోచర్లు ఉన్నాయి. వీటిని ఇప్పుడు పర్చేజ్ చేసి తర్వాత
వాడుకోవచ్చు. వోచర్ కొనగానే అది స్టోర్డ్ వోచర్స్ మోనూలో స్టోర్ అవుతుంది. దీన్ని తర్వాత యాక్టివేట్ చేసుకుని వాడుకోవచ్చు.
ఇవీ స్పెషాలిటీస్
ఇప్పటివరకు మనం ఏ మొబైల్‌కైనా కొత్త టారిఫ్‌తో రీఛార్జి చేయించుకుంటే అది తక్షణ అమల్లోకి వస్తుంది. అంటే అప్పటికి ఉన్న పాత టారిఫ్
ఆటోమేటిగ్గా కట్ అయిపోతుంది. కొత్త ఫీచర్‌తో ఆ ఇబ్బంది లేదు. స్టోర్ చేసుకుని మన ప్రస్తుత ఆఫర్ అయిపోయాకే ఆ వోచర్‌ను యాక్సెస్
చేసుకోవచ్చు. అంతేకాదు ఈ వోచర్లను మనం ఎవరికైనా గిఫ్ట్‌గా కూడా పంపించవచ్చు. మై వోచర్స్‌లోనే ఉన్న ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్‌ను టాప్ చేసి
కావాల్సినవారికి వోచర్ పంపించుకోవచ్చు.
ఉపయోగం ఏమిటి?
ఈ ఫీచర్ ఇండియన్ టెలికం రంగానికి కొత్తే కానీ దీనివల్ల యూజర్‌కు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పుడు వోచర్ కొని
మూడు నెలల తర్వాత యాక్టివేట్ చేసుకుంటే ఇప్పటి టారిఫ్ అప్లై అవుతుందా.. అప్పటికి ఉన్న టారిఫ్ ప్రకారం వస్తుందా అనేదీ తెలియదు.
అయితే జియో దీనిలో కూడా యూజర్లను ఆకట్టుకునే మంత్రం ఏదో కచ్చితంగా పెడుతుందన్నది టెక్నాలజీ ఎక్స్‌పర్ట్‌ల అంచనా.