• తాజా వార్తలు

జియో నుంచి వచ్చిన టాప్ 5 ఎవర్‌గ్రీన్ ప్లాన్స్ మీకోసం 

దేశీయ టెలికం రంగంలో జియో రాకతో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్న సంగతి విదితమే. జియో దెబ్బతో ఆకాశాన్ని తాకిన డేటా ధరలు భూమిని తాకాయి. ఉచిత ఆఫర్లతో రిలయన్స్ జియో యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంది. ఇతర నెట్ వర్క్ ల నుంచి చాలామంది యూజర్లు జియోకు మారిపోయారు. ఉచిత ఆఫర్ల తరువాత అత్యంత తక్కువ ధరకే కొత్త కొత్త డేటా ఆఫర్లు అందిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో జియో నుంచి వచ్చిన టాప్ 5 ఎవర్ గ్రీన్ ప్లాన్లను ఓ సారి చూద్దాం. ఈ ప్లాన్లు అన్నీ రోజుకు 1.5GB డేటా ప్యాక్‌తో వచ్చాయి 

రూ.149 రీఛార్జ్ ప్లాన్ : 
ఈ ప్లాన్ కింద యూజర్లు రోజుకు 1.5GB డేటా పొందవచ్చు. 28రోజుల కాలపరిమితిపై అన్ లిమిటెడ్ కాలింగ్ ఆప్షన్ అందిస్తోంది. రోజుకు 100SMSలు పొందవచ్చు. జియో మొబైల్ యాప్స్ కాంప్లీమెంటరీ సబ్ స్ర్కిప్షన్ పొందే అవకాశం ఉంది. 

రూ. 349 ప్లాన్ : 
జియో యూజర్లు.. ఈ రీఛార్జ్ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే.. 70రోజుల కాల పరిమితిపై 1.5GB డేటాను పొందవచ్చు. అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ తో పాటు రోజుకు 100 SMS లు పొందవచ్చు. జియో మొబైల్ యాప్స్ కాంప్లీమెంటరీ సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు. 

రూ. 399 ప్లాన్ : 
రిలయన్స్ జియో యూజర్లు ఈ ప్లాన్ ద్వారా 84రోజుల కాలపరిమితిపై 1.5GB ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ తో పాటు రోజుకు 100SMS లు వరకు పొందవచ్చు.

రూ.499 రీఛార్జ్ ప్లాన్ : 
ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకున్న యూజర్లకు 91రోజుల కాలపరిమితిపై 1.5GB ఇంటర్నెట్ డేటా వరకు పొందవచ్చు. అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్, రోజుకు 100SMSలు పొందవచ్చు. 

రూ. 1,699 రీఛార్జ్ ప్లాన్ : 
ఈ రీఛార్జ్ ప్యాక్ కింద.. జియో యూజర్లు రోజుకు 1.5GB డేటా చొప్పున 365 రోజుల వరకు పొందవచ్చు. మిగతా ఆఫర్లు ఒకేలా ఉంటాయి. అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100SMSలు, జియో మొబైల్ యాప్స్ కోసం కాంప్లీమెంటరీ సబ్ స్ర్కిప్షన్ కూడా ఉచితంగా పొందే అవకాశం ఉంది.

జన రంజకమైన వార్తలు