రిలయన్స్ జియో గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును అధికారికంగా సెప్టెంబర్ 5నుంచి ప్రారంభించనున్నట్లు జియో అధినేత తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. ఫిక్స్ డ్ ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే కాకుండా జియో ఫైబర్ కనెక్షన్ ఫిక్స్ డ్ లైన్ ఫోన్ సర్వీసు, సెటప్ టాప్ బాక్సు, ఫ్రీగా 4K TV, జియో IoT సర్వీసులను కూడా ఆఫర్ చేస్తోంది. కాగా మొబైల్ డేటా మాదిరిగానే జియో ఫైబర్ సర్వీసు కూడా చౌకైన ధరకే అందుబాటులోకి రానుంది. అయితే జియో ఫైబర్ నచ్చుకుంటే మార్కెట్లో 3 ఆపర్లు రెడీగా ఉన్నాయి.
Airtel V-Fiber
ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసును నెలకు రూ.799 నుంచి ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్ ద్వారా 40Mbps స్పీడ్ తో నెట్ ను యూజర్లు పొందవచ్చు.అలాగే ఎంటర్ టైన్ డేటా ప్లాన్ కింద నెలకు రూ.1,099 చెల్లిస్తే 100Mbps స్పీడ్‌తో 300GB వరకు డేటా లిమిట్ పొందవచ్చు. అదనంగా 1000GB బోనస్ డేటాను ఢిల్లీ సర్కిల్ లో ఉన్న వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5 ప్రీమియం, ఎయిర్ టెల్ టీవీ ప్రీమియం వంటివి ఉచితంగా పొందవచ్చు.
Tata Sky బ్రాడ్ బ్యాండ్
టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ప్రారంభ ధర నెలకు రూ.999 నుంచి ఆఫర్ చేస్తోంది. రూ.999తో రీఛార్జ్ చేసుకుంటే 25Mbps స్పీడ్ డేటాను పొందవచ్చు. రిలయన్స్ జియో ఫైబర్ సర్వీసు కంటే ఇది తక్కువనే చెప్పాలి. ఈ డేటా ప్లాన్‌లో ఎలాంటి డేటా లిమిట్ ఆఫర్ లేదు. ఉచితంగా రూటర్ పొందవచ్చు. రూ.1599 డేటా ప్లాన్ ద్వారా 100Mbps స్పీడ్ డేటా ఆఫర్ చేస్తోంది. ఇందులో జియో ఫైబర్ సర్వీసు మాదిరిగా ఉచితంగా ఇన్ స్టాలేషన్ ఆఫర్ లేదు.
ACT Fibernet :
యాక్ట్ ఫైబర్ నెట్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులో కూడా మంచి డేటా ఆఫర్లు ఉన్నాయి. యాక్ట్ సిల్వర్ ప్రొమో కింద ప్రారంభ ధర రూ.749 ప్లాన్ పొందవచ్చు. ఈ డేటా ప్లాన్ పై 100Mbps స్పీడ్‌తో 500GB వరకు డేటా లిమిట్ పొందవచ్చు. యాక్ట్ ప్లాటీనం ప్రొమో ప్లాన్ కింద ACT ఫైబర్ నెట్ 150Mbps స్పీడ్ తో 1000GB డేటా లిమిట్ అందిస్తోంది. అంతేకాకుండా ACT ఎంటర్ టైన్ మెంట్ ప్లాన్ యాక్టివేషన్ ద్వారా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం సర్వీసులైన Netflix సబ్ స్రిప్షన్ యాక్టివేట్ చేసుకోవచ్చు.