• తాజా వార్తలు

జీఎస్టీ దెబ్బ... జులై 4 వరకు నో సిమ్ కార్డ్స్ అంటున్న ప్రయివేటు కంపెనీలు, బీఎస్సెన్నెల్ మాత్రం రె

దేశమంతా ఒకే పన్ను విధానంగా జీఎస్టీ శనివారం నుంచి అమల్లోకి వస్తున్న తరుణంలో ప్రయివేటు టెలికాం కంపెనీలు కొన్ని జాగ్రత్తులు తీసుకుంటున్నాయి. సిమ్‌ కార్డులు, రీచార్జి కార్డులపై పన్ను రేటు పెరుగుతుండడంతో వాటి జారీని తాత్కాలికంగా ఆపేశాయి. మళ్లీ జులై 5 నుంచి జారీ చేయాలని నిర్ణయించాయి. 
    సిమ్‌ కార్డులు, రీచార్జ్‌ కార్డులపై ప్రస్తుతం 15 శాతం పన్ను ఉండగా, జీఎస్టీలో పన్ను రేటును 18 శాతానికి పెంచారు. ఈ మేరకు టెలికం సంస్థలు తమ సిమ్‌కార్డులు, రీచార్జ్‌ కార్డుల రేట్లు, ఇతరత్రా రికార్డుల్లో మార్పులు చేయాల్సి ఉంది. ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలి. దీనికి సంబంధించి ప్రైవేటు టెలికం సంస్థలు వారం రోజులుగా కసరత్తు చేస్తున్నాయి. జీఎస్టీ అమలవుతున్న జులై 1కి ఇది పూర్తయ్యే పరిస్థితి లేకపోవడంతో జులై 4 వరకు టైం తీసుకుంటున్నాయి. 
    అయితే... ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు మాత్రం తమ సాఫ్ట్‌వేర్‌ను కొన్నిరోజుల క్రితమే అప్‌డేట్‌ చేసింది. ఏజెన్సీలకు యథాతథంగా సిమ్‌కార్డులు, రీచార్జ్‌ కార్డుల సరఫరాను కొనసాగిస్తోంది. 
 

జన రంజకమైన వార్తలు