• తాజా వార్తలు

మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ 4 రూ .999 ప్రీపెయిడ్ ప్లాన్లు మీకోసం 

దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు పోటీలు పడుతూ ఎవరికి వారు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్లాన్లు ప్రకటిస్తూ వెళుతున్నారు. మార్కెట్లో జియో ఎంట్రీ తరువాత డేటా అనేది చీప్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అన్ని కంపెనీలు ప్లాన్లను అటు ఇటూగానే అమలు చేస్తున్నాయి. ఈ శీర్షికలో భాగంగా రూ.999 ప్లాన్ గురించి ఇస్తున్నాం. ఓ లుక్కేయండి.

రిలయన్స్ జియో: 
రిలయన్స్ జియో రూ .999 ప్రీపెయిడ్ ప్లాన్  కాస్త బిన్నంగా ఉంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ కేవలం 90 రోజులు మాత్రమే. ఈ ప్లాన్‌లో జియో 60GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తోంది. ఇవే కాకుండా వినియోగదారులు రోజుకు 100 SMS లను కూడా పొందవచ్చు. చందాదారులు జియో యొక్క అన్ని యాప్ ల పోర్ట్‌ఫోలియోకు కాంప్లిమెంటిరీ సభ్యత్వాన్ని కూడా పొందుతారు.

వొడాఫోన్ : 
వొడాఫోన్ 999 రీచార్జ్ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. అయితే ఈ ప్లాన్ కేవలం 12 జీబీ డేటాను మాత్రమే అందిస్తోంది. ఇతర కంపెనీల లాంగ్ టర్మ్ ప్లాన్లు రోజుకు 1 జీబీ డేటాను అందిస్తున్న విషయం తెలిసిందే. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఈ ప్లాన్ వోడాఫోన్ ప్లే యాప్ ద్వారా ఉచిత లైవ్ టీవీ మరియు సంగీతాన్ని అందిస్తుంది. 

ఎయిర్‌టెల్ : 
336 రోజుల వ్యాలిడిటీ గల రూ.998 రీఛార్జ్ ప్లాన్ లో భాగంగా అన్ లిమిటెడ్ కాల్స్, ప్రతినెలకి 300 ఎస్ఎంఎస్ లతో పాటు పూర్తి వ్యాలిడిటీ కాలానికి 12 జీబీ డేటా లభించనుంది.ఈ ప్లాన్‌లో అదనపు ప్రయోజనాలు వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ టివి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఒక సంవత్సరం నార్టన్ మొబైల్ సెక్యూరిటీ మరియు 4G డివైస్ క్యాష్‌బ్యాక్ రూ .2,000 వరకు ఉన్నాయి.

ఐడియా: 
ప్రీపెయిడ్ విభాగంలో ఐడియా యొక్క 999 రూపాయల ఆఫర్ ఇతర సమర్పణల మాదిరిగానే ఇది కూడా 365 రోజుల చెల్లుబాటు సమయంతో వస్తుంది. ఈ ప్లాన్ లో టెలికాం ఆపరేటర్ అపరిమిత లోకల్, ఎస్‌టిడి మరియు రోమింగ్ కాల్‌లతో మొత్తం చెల్లుబాటు కాలానికి 12GB డేటాను అందిస్తుంది. చందాదారులు 365 రోజుల కాల వ్యవధిలో మొత్తంగా 3600 SMS లని ఆనందిస్తారు. అయితే మిగిలిన వారితో పోలిస్తే ఈ ప్రణాళికకు గుర్తించదగిన అదనపు ప్రయోజనాలు లేవు.

జన రంజకమైన వార్తలు