• తాజా వార్తలు

వొడాఫోన్ సిమ్ ఆర్డర్ చేస్తే  ఉచితంగా డోర్ డెలివ‌రీ, బుకింగ్ గైడ్ మీకోసం

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న వొడాఫోన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ కార్డులను ఆర్డర్ చేసిన వారికి ఉచిత డోర్ డెలివరీ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగానే 
వొడాఫోన్ ప్రీపెయిడ్ సిమ్‌ల‌కు గాను ఉచిత డోర్ డెలివ‌రీ సేవ‌ల‌ను ప్రారంభించింది. 

క‌స్ట‌మ‌ర్లు ఆన్‌లైన్‌లో వొడాఫోన్ ప్రీపెయిడ్ 4జీ సిమ్‌ను ఆర్డ‌ర్ చేస్తే వారికి ఆ సిమ్‌ను ఉచితంగా డోర్ డెలివ‌రీ ఇస్తారు. అయితే ఇందుకోసం యూజర్లు వొడాఫోన్ ప్లాన్ లోకి మారాల్సి ఉంటుంది. సిమ్ ఉచిత డోర్ డెలివరీ పొందాలంటే వారు రూ.249 రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.దాంతో వారికి రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులుగా నిర్ణ‌యించారు. 

కాగా వొడాఫోన్ సిమ్‌ను ఆర్డ‌ర్ చేయాలంటే క‌స్ట‌మ‌ర్లు వొడాఫోన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అందులో ప్రీపెయిడ్ సిమ్ విభాగంలో ఉండే బై నౌ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. అయితే కొత్త సిమ్ మాత్ర‌మే కాకుండా, ఇప్ప‌టికే వినియోగంలో ఉన్న ఇత‌ర నెట్‌వ‌ర్క్‌కు చెందిన సిమ్‌ను కూడా ఎంఎన్‌పీలో వొడాఫోన్‌లోకి మార్చుకోవ‌చ్చు. అలా మార్చుకున్నా సిమ్‌ను డోర్ డెలివ‌రీ చేస్తారు. ఇక వినియోగ‌దారులు రూ.249 ను మాత్రం ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది.

వొడాఫోన్‌లో ఇప్పటికే రూ.129, రూ.159, రూ.169 ప్లాన్‌లు ఉండగా రూ.139తో మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తో పాటు ఉచిత రోమింగ్ లభిస్తుంది. 2జీబీ 4జీ/3జీ డేటా లభిస్తుంది. అలాగే వొడాఫోన్ ప్లే సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితమే. కాలపరిమితి 28 రోజులు.దీంతో పాటు రూ139 ప్లాన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. సబ్‌స్క్రైబర్లు వొడాఫోన్ రూ.139 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 5 జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ ప్రస్తుతం కొన్ని సర్కిళ్లలో ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. 

ఇకపోతే వొడాఫోన్ కంపెనీ ఇటీవలే రూ.16 ప్రిపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 1 జీబీ డేటా పొందొచ్చు. ప్లాన్ వాలిడిటీ 1 రోజు మాత్రమే. ఇందులో ఎలాంటి వాయిస్ కాల్స్ సౌకర్యం ఉండదు.
 
 

జన రంజకమైన వార్తలు