దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం వొడాఫోన్ పోస్టు పెయిడ్ వినియోగదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది.ఒకే ఒక్క సింగిల్ ప్లాన్‌ను ఐదుగురు కుటుంబ సభ్యులు ఉపయోగించుకునేలా రూ.999తో ‘రెడ్ టుగెదర్’ ప్లాన్‌ను తీసుకొచ్చింది. భారత్‌లోని వినియోగదారుల ఈ రెడ్ టుగెదర్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఉపయోగించుకోవచ్చు. రూ.399 నుంచి రూ.999 వరకు ఈ ప్లాన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
రూ.399 ప్లాన్
రూ.399 ప్లాన్‌లో 40జీబీ డేటా ఉచితంగా వస్తుంది. ఈ ప్లాన్‌లో భాగంగా 200 జీబీ డేటాను రోల్ ఓవర్ సౌకర్యంతో అందిస్తోంది. దీంతోపాటు అదనంగా ఏడాదిపాటు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని ఉచితంగా ఇస్తోంది. అలాగే, వొడాఫోన్ ప్లే యాప్ సబ్‌స్క్రిప్సన్ కూడా లభిస్తుంది.
రూ.499 ప్లాన్‌లో 75జీబీ డేటా, రూ.598 ప్లాన్‌లో 50 జీబీ డేటా ఉచితంగా వస్తాయి. రూ.598 ప్లాన్‌లో రెండు కనెక్షన్లు తీసుకోవచ్చు. అలాగే రూ.749 ప్లాన్‌లో 60 జీబీ డేటా వస్తుంది. 3 కనెక్షన్లు తీసుకోవచ్చు. రూ.899 ప్లాన్‌లో 70 జీబీ డేటా వస్తుంది. 4 కనెక్షన్లు తీసుకోవచ్చు. రూ.999 ప్లాన్‌లో 80 జీబీ డేటా లభిస్తుంది. 5 కనెక్షన్లు తీసుకోవచ్చు. కాగా రూ.598 మొదలుకొని రూ.999 వరకు ఉన్న ప్లాన్లలో ఒక్కో కనెక్షన్‌కు డేటా కోటా 30జీబీ వరకు లభిస్తుంది. ఇక ఈ ప్లాన్లన్నింటిలోనూ అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి.
కాగా రెడ్ టుగెదర్ ప్లాన్లను తీసుకునే వారికి పలు ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఈ ప్లాన్లలో 200జీబీ డేటా వరకు డేటా రోల్ ఓవర్ సదుపాయం ఉంటుంది. 1 ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా పొందవచ్చు. వొడాఫోన్ ప్లే, లైవ్ టీవీ, జీ5 ప్రీమియం కంటెంట్, సోనీ లివ్, షెమారూ, సన్ ఎన్‌ఎక్స్‌టీ, ఆల్ట్ బాలాజీ కంటెంట్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. వీటితోపాటు ఉచిత మొబైల్ షీల్డ్ ప్లాన్ లభిస్తుంది. ఇందులో ఫోన్లకు అయ్యే డ్యామేజ్‌ను ఉచితంగా కవర్ చేస్తారు. ఫోన్లకు అయ్యే ఫిజికల్, లిక్విడ్ డ్యామేజ్‌ను ఈ ప్లాన్ కింద ఉచితంగా కవర్ చేస్తారు.