దేశీయ టెలికాం రంగం ఇప్పుడు జియోకు ముందు జియోకు తరువాత అన్నచందంగా తయారైంది. డేటా టారిఫ్ వార్ అనేది పీక్ స్టాయికి చేరింది. టెల్కోలు ప్రత్యర్థులకు పోటీగా కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే పాత ప్లాన్లను రివైజ్ చేస్తూ వస్తున్నాయి. ఈ దశలో వొడాఫోన్ ఓ అడుగు ముందుకేసింది. తన పాత ప్లాన్లలో భారీ మార్పులు చేసింది.
వొడాఫోన్ రూ.509 ప్లాన్
వోడాఫోన్ ఇప్పటికే అందిస్తున్న రూ. 509 ప్రీపెయిడ్ ప్లాన్‌లో తాజాగా మార్పులు చేసింది. ఈ ప్లాన్ క్రింద వినియోగదారులు ఇప్పటి వరకు అపరిమిత లోకల్ మరియు ఎస్‌టీడీ కాల్‌లతో పాటు ప్రతిరోజూ 1.4 జీబీ డేటాను పొందుతుండగా ఇక నుండి రూ. 509తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు అపరిమిత కాల్‌లతో పాటుగా 1.5 జీబీ డేటాను అందించనుంది.అంతే కాకుండా డేటా స్పీడ్‌ను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ అన్నీ ప్రాంతాల వినియోగదారులకు వర్తిస్తుంది.దీని వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంటుంది.
వోడాఫోన్ రూ.209 ప్లాన్ లో కూడా భారీ మార్పులు చేసింది. గతంలో ఈ ప్లాన్ ను రీఛార్జి చేసుకునే వారికి 28 రోజులు పాటు రోజుకి 1.5 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభించేవి.అయితే ఇప్పుడు మారిన ప్లాన్ ప్రకారం రోజుకి 1.6జేబీ డేటా అందిస్తుంది.వోడాఫోన్ రూ.479 ప్లాన్ లో కూడా భారీ మార్పులు చేసింది. గతంలో ఈ ప్లాన్ ను రీఛార్జి చేసుకునే వారికి 84 రోజులు పాటు రోజుకి 1.5 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభించేవి.అయితే ఇప్పుడు మారిన ప్లాన్ ప్రకారం రోజుకి 1.6జేబీ డేటా అందిస్తుంది.
గతంలో వోడాఫోన్ రూ.1499 వార్షిక ప్లాన్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు ఆ ప్లాన్ ను తీసేసి రూ.1,699 ప్లాన్ ను లాంచ్ చేసింది.ఈ ప్లాన్ కింద రోజుకు 1జీబీ డేటాను వొడాఫోన్ ఆఫర్ చేయనుంది. దీనిపై కూడా ఇతర ప్రయోజనాలు అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు కూడా యూజర్లు పొందనున్నారు.ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు