టెలికం రంగంలో దూసుకుపోతున్న ప్రముఖ టెలికం కంపెనీ వొడాఫోన్ తన రూ.139 ప్రీపెయిడ్ ప్లాన్‌లో పలు మార్పులను చేసింది. ఎయిర్‌టెల్ తాజాగా రూ.148 ప్లాన్ లాంచ్ చేయడంతో దీనికి పోటీగా కంపెనీ ఈ ప్లాన్ లో మార్పులను చేసింది. ఈ ప్లాన్‌లో ఇప్పటి వరకు అందిస్తున్న డేటాకు అదనంగా ఒక జీబీ డేటాను చేర్చింది. రూ.139 ప్లాన్‌లో ఇప్పటి వరకు 2జీబీ డేటా లభిస్తుండగా ఇప్పుడు దీనికి అదనంగా మరో జీబీ డేటాను కలిపి 3జీబీ డేటాను అందిస్తోంది. దీని కాలపరిమితి 28 రోజులు.దీంతో పాటుగా ఇప్పటి వరకు రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు ఇవ్వగా, ఇప్పుడు వాటిని మొత్తం 100 ఎస్సెమ్మెస్‌లుగా మార్చింది. అపరిమిత లోకల్, ఎస్టీడీ, నేషనల్ రోమింగ్ కాల్స్ వంటి వాటిలో ఎటువంటి మార్పులు లేవు.
కంపెనీ ఈ ప్లాన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో వొడాఫోన్ 139 ప్లాన్ కింద సబ్‌స్క్రైబర్లు 5 జీబీ డేటా లభించేది. అలాగే రోజుకు 300 ఎస్ఎంఎస్‌లు పంపుకునే వీలుంది.. అపరిమిత లోకల్ కాలింగ్ సదుపాయం ఉంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. దీన్ని ఇప్పుడు పూర్తిగా మార్చివేసింది. సవరించిన ప్లాన్ కేవలం కొన్ని సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.
వొడాఫోన్ ఇదివరకు రూ.129 ప్రిపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌లో మార్పులు చేసింది. ఈ మార్పులు అన్ని సర్కిళ్లలోని యూజర్లకూ వర్తిస్తాయి. కస్టమర్లు ఈ ప్లాన్ ద్వారా ఇదివరకు రూ.1.5 జీబీ డేటా పొందేవారు. ఇప్పుడు వీరికి 2 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. Vodafone 129 Planలో డేటాతోపాటు అపరిమిత కాలింగ్ సదుపాయం కూడా ఉంటుంది. ప్లాన్ వాలిడిటీ కాలంలో 300 ఎస్ఎంఎస్‌లు పొందొచ్చు. తక్కువ డేటా, ఎక్కువ కాల్స్ కోరుకునే వారికి ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది.
వొడాఫోన్ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ రూ.129 ప్రిపెయిడ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. తొలిగా 1.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయంతో ఈ ప్లాన్ తీసుకువచ్చింది. తర్వాత ఎస్ఎంఎస్ ప్రయోజనాన్ని యాడ్ చేసింది. ఇప్పుడు 500 ఎంబీ అదనపు డేటా అందిస్తోంది.