• తాజా వార్తలు

16 రూపాయలకే 1జిబి డేటా, వొడాఫోన్ పూర్తి ప్లాన్లు ఇవే

టెలికం దిగ్గజంవొడాఫోన్ తాజాగా మరో కొత్త రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రిపెయిడ్ సబ్‌స్క్రైబర్ల కోసం ఈ ప్లాన్ ను తీసుకువచ్చింది. వొడాఫోన్ 16 ఫిల్మీ పేరుతో వచ్చిన ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 1జిబి డేటాను పొందవచ్చు. కేవలం రూ. 16 చెల్లించి ఒక రోజు వ్యాలిడితో యూజర్లు 1జిబి డేటాను పొందవచ్చు. ఇందులో ఎలాంటి టాక్‌టైమ్ కానీ, ఎస్ఎంఎస్‌లు కానీ రావు. మరోవైపు ఐడియా కూడా రూ.16లతో ఇలాంటి ప్లాన్‌నే ఆవిష్కరించింది.  రూ.16 ప్లాన్ మాత్రమే కాకుండా వొడాఫోన్ రూ.29 ప్లాన్ కూడా అందిస్తోంది. ఇందులో 500 ఎంబీ డేటాను పొందొచ్చు. వాలిడిటీ 28 రోజులు. రూ.47 ప్లాన్‌తో 3 జీబీ డేటా పొందొచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 1 రోజు. రూ.92 ప్లాన్‌తో వారం రోజులు 6 జీబీ డేటా లభిస్తోంది. వొడాఫోన్ టాప్ 5 రీచార్జ్ ప్లాన్లు ఓ సారి పరిశీలిస్తే..

వొడాఫోన్ రూ.509 ప్లాన్
వోడాఫోన్ ఇప్పటికే అందిస్తున్న రూ. 509 ప్రీపెయిడ్ ప్లాన్‌లో తాజాగా మార్పులు చేసింది. ఈ ప్లాన్ క్రింద వినియోగదారులు ఇప్పటి వరకు అపరిమిత లోకల్ మరియు ఎస్‌టీడీ కాల్‌లతో పాటు ప్రతిరోజూ 1.4 జీబీ డేటాను పొందుతుండగా ఇక నుండి రూ. 509తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు అపరిమిత కాల్‌లతో పాటుగా 1.5 జీబీ డేటాను అందించనుంది.

90 రోజుల వ్యాలిడిటీ
అంతే కాకుండా డేటా స్పీడ్‌ను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ అన్నీ ప్రాంతాల వినియోగదారులకు వర్తిస్తుంది.దీని వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంటుంది.

రూ.209 ప్లాన్
వోడాఫోన్ రూ.209 ప్లాన్ లో కూడా భారీ మార్పులు చేసింది. గతంలో ఈ ప్లాన్ ను రీఛార్జి చేసుకునే వారికి 28 రోజులు పాటు రోజుకి 1.5 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభించేవి.అయితే ఇప్పుడు మారిన ప్లాన్ ప్రకారం రోజుకి 1.6జేబీ డేటా అందిస్తుంది.

రూ.479 ప్లాన్
వొడాఫోన్ రూ.479 ప్లాన్ లో కూడా భారీ మార్పులు చేసింది. గతంలో ఈ ప్లాన్ ను రీఛార్జి చేసుకునే వారికి 84 రోజులు పాటు రోజుకి 1.5 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభించేవి.అయితే ఇప్పుడు మారిన ప్లాన్ ప్రకారం రోజుకి 1.6జేబీ డేటా అందిస్తుంది.
 

జన రంజకమైన వార్తలు