సైబర్ సెక్యూరిటీ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకo గా తీసుకున్నట్లు కనిపిస్తుంది.మొన్న చైనా లో జరిగిన సమావేశం లో అంతర్జాతీయ కంపెనీలతో సైబర్ సెక్యూరిటీ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించిన విషయం మనకు తెలిసినదే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖామంత్రి పల్లె రఘునాథ రెడ్డి కూడా సైబర్ సెక్యూరిటీ యొక్క అవశ్యకతనూ, ప్రబుత్వం ఆ దిశగా తీసుకుంటున్న చర్యలనూ వివరించారు. ఇజ్రాయెల్ కు చెందిన ఒక సంస్థ సైబర్ సెక్యూరిటీ పై విజయవాడ లో నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ విశేషాలు ఆయన మాటల్లోనే
“హ్యాకింగ్ వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచాన్ని కలిచి వేస్తుంది.అత్యంత విలువైన సమాచారాన్ని ఈ సైబర్ క్రైమ్ అనే పెనుభూతం నాశనం చేస్తుంది.సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి దర్యాప్తు సంస్థలతో పాటు ప్రజలు కూడా వారి పరిధిలో ఐటి నైపుణ్యాన్ని పెంచుకోవాలి.దేశం లోనే ఎపి ప్రభుత్వం ఈ రంగం లో ముందు ఉండాలన్న ఉద్దేశం తో సైబర్ నిపుణులను తయారు చేసేందుకు తిరుపతి లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సైబర్ స్కూల్ ను ఏర్పాటు చేయనుంది. ఈ నెలనుండే ఆ స్కూల్ లో అడ్మిషన్ లు ప్రారంభం అవుతాయి. అతి త్వరలోనే అమరావతి, విశాఖపట్నం లలో కూడా ఈ తరహా స్కూల్ లను ఏర్పాటు చేయనుంది. ఇకపై సైబర్ సెక్యూరిటీ కి ఎపి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది.మనదేశం లోనే ముఖ్య సముద్ర తీర వ్యాపార నగరం అయిన విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి డిఫెన్సు సైబర్ సెక్యూరిటీ సెంటర్ ను ఎపి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా తన సహకారాన్ని ఇవ్వనుంది.”
సైబర్ సెక్యూరిటీ కి ప్రత్యేక స్కూల్ లను ఎపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ నేపథ్యం లో ఈ రంగం లో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కంప్యూటర్ విజ్ఞానం కోరుతుంది.
|