ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి ఇంటికీ 100 రూపాయలకే ఇంటర్నెట్ ను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ విషయం పై ముఖ్య మంత్రి ఛంద్ర బాబు నాయుడు గట్టి సంకల్పం తో ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబందించి సర్వే ఇప్పటికే పూర్తి అయింది. దీని కొసం ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ ప్రాజెక్ట్ ను ప్రభుత్వం ప్రారంభించింది.
రాష్ట్రం మొత్తం భూగర్భ లైన్లు వేయడం ఖర్చుతోనూ శ్రమ తోనూ కూడుకున్న పని కాబట్టి 30 కెవి విద్యుత్ లైన్ల ద్వార అన్ని మండల కేంద్రాలకు నెట్ సిగ్నల్ లను చేర వేస్తారు. అక్కడ నుండి అన్ని గ్రామాలకు భూగర్భ లైన్ల ద్వారా కనెక్టివిటీ ని పెంచుతారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరి కొన్ని రోజులలోనే ప్రతి ఇంటికీ కేవలం 100 రూపాయలకే 10mbps స్పీడు తో ఇంటర్నెట్ ను అందించ బోతున్నారు.
రాష్ట్రం లో ని ప్రతి ఇంటిలో కనీసం ఒకరిని ఈ అక్షరాస్యులుగా చేయాలనేది ప్రభుత్వ సంకల్పంగా ఉన్నట్లు మంత్రి శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. ఐ టి శాఖ కార్యదర్శి శ్రీ శ్రీధర్ అధ్వర్యం లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి.