• తాజా వార్తలు

పుష్కరాల భద్రత కు అతి కీలకం –ఫేషియల్ రెకగ్నిషన్ సిస్టం (FRS)

పుష్కరాల భద్రత కు అతి కీలకం –ఫేషియల్ రెకగ్నిషన్ సిస్టం (FRS)

మీకు FRS అంటే తెలుసా? ఎఫ్.ర్.ఎస్  అంటే ఫేషియల్ రెకగ్నిషన్ సిస్టం. అంటే మన ముఖం చూసి మన వివరాలు తెలిపే టెక్నాలజీ అన్నమాట. సరిగ్గా ఆ టెక్నాలజీనే మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకోనుంది. ఏమిటా టెక్నాలజీ? ఎక్కడ వినియోగిస్తున్నారు?

గత మూడు రోజుల క్రితం పవిత్ర కృష్ణా నదీ పుష్కరాలు ప్రారంభమైన సంగతి మనందరికీ తెలిసినదే. ఈ పుష్కరాలకు సుమారు 5 కోట్ల మంది భక్తులు హాజరు అవుతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ స్థాయిలో భక్తులు హాజరయ్యేటపుడు నేరగాళ్ళు, మోసగాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది ఈ సమయం లో యాత్రికుల భద్రత, రక్షణ అనేది ప్రభుత్వానికి సవాలుగా మారనుంది. ఇప్పటికే అనేక టెక్నాలజీ లను వాడుకుంటున్నప్పటికీ , ఆ నేరగాళ్ళ ను అదుపు చేయడానికి, గుర్తించడానికి ఈ టెక్నాలజీ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించనుంది.

పుష్కరాలు జరిగే ప్రాంతమంతా CCTV కెమెరా లను అమర్చారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఈ కెమెరా లు రికార్డ్ చేస్తాయి. అయితే CCTV కెమెరా ల ద్వారా రికార్డు అయిన దృశ్యాలు పోలీసులకు ఉపయోగకరంగా ఉంటునప్పటికీ కొంచెం స్పష్టత అనేది లోపిస్తుంది. అందుకే ఈ టెక్నాలజీ ని వాడుతున్నారు. అంటే CCTV కెమెరా లో ఏ వ్యక్తి నైనా గుర్తిస్తే ఈ టెక్నాలజీ ని ఉపయోగించి ఆ వ్యక్తి ముఖాన్ని గుర్తించడం ద్వారా అతని వివరాలు తెలిపేలా ఈ టెక్నాలజీ  ఉంటుంది. వేల సంఖ్యా లో ఉన్న CCTV కెమెరా లనుండి సేకరించిన ఫోటో లను తమ దగ్గర ఉన్న అసాంఘిక శక్తుల డేటా బేస్ తో జత చేసి నిందితులను ఇట్టే కనిపెట్టేస్తుంది. కొని సెకన్ల వ్యవధి లోనే ఇది ఫలితాలను విశ్లేషిస్తుంది. దీని దగ్గర 16 లక్షల మంది నిందితుల వివరాలు ఉన్నాయి. NEC వారి ఈ ఫేషియల్ రెకగ్నిషన్ సిస్టం ప్రపంచం లోనే అత్యుత్తమ టెక్నాలజీ గా నిలిచింది. వేగం లోనూ, ఖచ్చితత్వం లోనూ ఇప్పటికే ఇదే ప్రపంచం లో నెంబర్ వన్.

NEC వారి ఈ FRS ను కృష్ణా పుష్కరాలలో ఉపయోగించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, డిజిపి శ్రీ N. సాంబశివరావు లు తమ ఆనందం వ్యక్తం చేశారు.