ప్రతి రంగం లోనూ ఆధునిక సాంకేతికతను జోడిస్తున్న ఆంధ్రపదేశ్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రత్తి కొనుగోళ్ళ లోనూ టెక్నాలజీని ఉపయోగించబోతుంది. ప్రత్తి కొనుగోళ్ళ లో విపరీతమైన అవినీతి పేరుకు పోవడాన్ని గమనించిన ఎపి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దానికి చెక్ పెట్టాలని చూస్తుంది. సాధారణంగా కొనుగోలు దారులు అందరూ యార్డుకు వెళ్లి అక్కడ తమకు నచ్చిన ధరకు ప్రత్తిని కొనుగోలు చేస్తారు. ఇక్కడ దళారీ వ్యవస్థ దోపిడీ ఎక్కువయ్యి రైతుకు, కొనుగోలు దారునికి ఎవ్వరికి లాభం జరగకుండా దళారీ లు లాభపడుతున్నారు. అంతే గాక చిన్నా, చితకా వ్యాపారులకు అవకాశం రావడం లేదు. ఈ విధానంలో ముందుగా మార్కెట్ లో ఉన్న ప్రత్తి రకాలను వాటి ధరలతో పాటు ఆన్ లైన్ లో ఉంచుతారు.కొనుగోలు దారులు తమకు నచ్చిన ధరకు కోట్ చెయ్యవచ్చు.వారిలో ఎవరైతే ఎక్కువ ధరకు కోట్ చేస్తారో వారికే ఆ ప్రత్తి లభిస్తుంది.అదే ఇంతకూ ముందు అయితే బడా వ్యాపార వేత్తలు తక్కువ ధరకే నాణ్యమైన పత్తిని కొనుగోలు చేసేవారు.దానివలన రైతులకు బాగా నష్టం వచ్చేది.ఈ ఆన్ లైన్ విధానంలో అటువంటి మోసాలు జరిగే అవకాశం లేదు. టెక్నాలజీ నా మజాకా! |