• తాజా వార్తలు

ఏపీలో సాఫ్ట్ వేర్ రంగ అభివృద్ధికి సిలికాన్ వ్యాలీ ప్రముఖులతో చంద్రబాబు చర్చలు


అమెరికా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ టెక్ కంపెనీల సీఈవోలు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. శుక్రవారం గూగుల్ ఉపాధ్యక్షడు టామ్ మూర్ చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఏపీలో గూగుల్ విస్తరణపై ఆయన చంద్రబాబుతో చర్చించారు. తమ నూతన ఆవిష్కరణల గురించి టామ్ వివరించగా, వాటిల్లో దేన్నైనా ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని, రాష్ట్రానికి వచ్చి స్థలాన్వేషణ సాగిస్తే, సెంటర్ ను ప్రారంభించేందుకు అవసరమైన అన్ని రకాల అనుమతులనూ సత్వరమే మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్

ఎఆర్ఎం హోర్డింగ్స్ సీఈవోతో సైమన్ ఆంథోనీ సైగర్స్ తో కూడా చంద్రబాబు బృందం భేటీ అయ్యింది. ఇంటర్ నెట్ ఆఫ్ ధిక్స్ పై ఎఆర్ఎం హోర్డిగ్స్ దృష్టి పెట్టింది. దీంతో పాలనలో సాంకేతికను జోడించిన అంశాన్ని సైగర్స్ కు చంద్రబాబు వివరించారు.

అమరావతి డెవలప్ మెంటే టార్గెట్
చంద్రబాబు పలువురు పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. కాలిఫోర్నియా గవర్నర్, ఫ్లెక్స్ ట్రాన్సిక్స్ సిఈవోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫ్లెక్స్ ట్రాన్సిక్స్ సీఈవో మైక్ మెక్ సమరతో ఏపీలో పెట్టుబడులకు ఉన్న సానుకూలతలను వివరించారు. ఈ సందర్భంగా తమ పారిశ్రామిక విస్తరణ ప్రణాళికలను మైక్ మెక్ సమర చంద్రబాబుకు వివరించారు. చంద్రబాబు ప్రతిపాదనల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. మొత్తానికి ఏపీ క్యాపిటల్ అమరావతి... ఏపీలోని ఇతర ప్రాంతాల్లో టెక్నాలజీ సంస్థలు, ఐటీ రంగ విస్తరణ దిశగా చంద్రబాబు సిలికాన్ వ్యాలీ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు.