ఏదైన సమాచారం కోసం ఈ మధ్య కాలంలో ప్రతీ వ్యక్తి ఆశ్రయించే ఏకైక సాధనం గూగుల్.. కానీ ఇప్పుడు గూగుల్ హ్యాకర్ల సహాయం కోరుతుంది. క్రోమ్ బుక్ ల్యాప్‌టాప్‌ను హ్యాక్ చేసి సెక్యూరిటి లోపాలను గుర్తించిన వారికి లక్ష డాలర్ల రివార్డును గూగుల్ ప్రకటించింది. గెట్ రిచ్ ఆర్ హ్యాక్ ట్రై ఇన్ అంటూ గుగుల్ సెక్యూరిటీ రివార్డ్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సెక్యూరిటీ పరిశోధకులు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చని తెలిపింది. క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్‌లోని సెక్యూరిటీ లోపాలని గుర్తించిన వారికి గతేడాది 50 వేల డాలర్లు ఇవ్వగా ఈ సారి అంతకు రెట్టింపు గెలుచుకోవచ్చిని గూగుల్ తెలిపింది. అయితే భద్రతా లోపాలను గుర్తించేప్పుడు తప్పనిసరిగా గెస్ట్ మోడ్‌లో మాత్రమే ఉండాలని నిబంధన విధించింది. విజేతలు గెలుపొందిన సొమ్మును సేవా సంస్థలకు విరాళాలుగా ఇవ్వాలనుకుంటే.. ప్రైజ్‌మనీని రెట్టింపు ఇస్తామని గూగుల్ ప్రకటించింది. ఇలా తమ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు గుర్తించిన వారికి గతేడాది 20లక్షల డాలర్లు చెల్లించినట్లు సంస్థ వెల్లడించింది. ఇలా 2010 నుంచి ఏటా బగ్ బాంటీ ఛాలెంజ్‌లు నిర్వహిస్తూ వస్తోంది. |