• తాజా వార్తలు

బాంకుకు కాల్ చేసి ఫ్రాడ్ జరిగిందని చెప్పకుండా అడ్దుకునే మాల్ వేర్ వచ్చింది జాగ్రత్త

బ్యాంకింగ్ అప్లి కేషన్స్ చేసి డబ్బులు దోచుకోవడానికి హ్యాకర్ లు మరో అడుగు ముందుకు వేశారు. కేవలం బ్యాంకింగ్ యాప్స్ ని హ్యాక్ చేసి.. అకౌంట్ లలో సొమ్ముని దారి మళ్ళించడమే కాకుండా అందుకు సంభందించిన ఫిర్యాదును సైతం బ్యాంకింగ్ సర్వీసులకు అందకుండా మాల్ వేర్ ను ఉపయోగించుకుంటున్నారు. రష్యా, కోరియాలలో ఈ మాల్ వేర్ కి అనేక మంది బాధితులు అయ్యారు. 2013లోనే ఈ మాల్ వేర్ ను గుర్తించారు. మాములుగా బ్యాంక్ అప్లికేషన్ హ్యాక్ అయిన సందర్భాలలో డబ్బులు దారి మల్లడాన్ని గుర్తించి కష్టమర్ కేర్ ను సంప్రదించి పిర్యాదులు చేయడం జరుగుతుంది. ఆ పిర్యాడులపై స్పందనగా బ్యాంకర్ లు చివరిలావాదేవీలను క్యాన్సిల్ చేస్తుంటారు. దీని వళ్ళ జరిగిన నష్టాన్ని కొంత వరకు పూడ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ మాల్ వేర్ తో ఆ అవకాశం కూడా ఉండదు. బ్యాంకింగ్ పిర్యాదు చేసే నంబర్ లను కూడా ఈ మాల్ వేర్ బ్లాక్ చేస్తుంది. దీనివల్ల పిర్యాదులు ఇచ్చే అవకాశం ఉండదు. రష్యా, సౌత్ కోరియాలలో ఈ మాల్ వేర్ తో బ్యాంక్ నంబర్ లు ఇలాగే బ్లాక్ అయ్యాయి. దీనిపై స్పందనగా మొబైల్ అప్లికేషన్స్ వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని బ్యాంకింగ్ సిండికేట్స్ తెలిపాయి.

 

జన రంజకమైన వార్తలు