• తాజా వార్తలు

కేవలం బ్లాక్డ్ వెబ్ సైట్ లను చూసినంత మాత్రానే మీరు జైలుకు వెళ్ళవలసిన అవసరం లేదు.

కేవలం బ్లాక్డ్ వెబ్ సైట్ లను చూసినంత మాత్రానే మీరు జైలుకు వెళ్ళవలసిన అవసరం లేదు.

ఈ హెచ్చరిక డిష్యుం సినిమా పైరసీ ని బ్లాక్ చేయడానికి సంబందిoచినది మాత్రమే !

పైరసీ ద్వారా సినిమా లను డౌన్ లోడ్ చేయడం లేదా స్ట్రీమింగ్ చేయడం ఇప్పటికీ చట్ట వ్యతిరేకమే !

గడచిన ఇరవై నాలుగు గంటలుగా  టెక్ మీడియా లోనూ, సోషల్ మీడియా లోనూ విపరీతం గా వినిపిస్తున్న కనిపిస్తున్న ఒకే ఒక అంశం. టోరెంట్ సైట్ లు చూస్తే జైలుకు వెళ్ళవలసి ఉంటుందా? కేవలం చూసినంత మాత్రాన మూడు లక్షల జరిమానా విధిస్తారా? అసలు ఈ వాదన లోనూ, ఈ వార్తల వెనకా ఉన్న నిజానిజాలు ఏమిటి? ఈ ప్రచారానికి సంబందిoచిన సమగ్ర సమాచారాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాము.

 జాన్ డూ ఆర్డర్స్

ఇంటర్ నెట్ లో ఏమేమి ఉండాలి? ఉండేవి ఎలాంటి పరిమితులకు లోబడి ఉండాలి? ISP లు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనే వాటి గురించి తెలిపే నియమాలనే జాన్ డూ ఆర్డర్స్ అని అంటారు.

అసలు ఏమి జరిగింది?

ఇకపై సినిమా లను ఆన్ లైన్ లో పైరసీ చేయలేని విధంగా ఒక టెక్నాలజీ వచ్చిందనీ సదరు టెక్నాలజీ తో మన దేశం లో విడుదల అయిన మొదటి సినిమా డిష్యూం అని నిన్నటి  ఆర్టికల్ లో చదువుకున్నాము కదా! అసలు ఈ వార్తలన్నింటికీ అక్కడే బీజం పడింది. కాపీ రైట్ చట్టాలను అతిక్రమించినదుకు జాన్ డూ ఆర్డర్ లను అనుసరించి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం  కొన్ని వెబ్ సైట్ లు బ్లాక్ చేయబడ్డాయి. సాధారణంగా పెద్ద సినిమా లు విడుదల అయ్యేటపుడు సినీ నిర్మాతలు కానీ స్టూడియో లు కానీ ఇలాంటి చట్టాలను ఉటంకిస్తూ ఉంటాయి. అది సర్వ సాధారణం. కానీ ఈ డిష్యుం సినిమా విడుదల అయ్యేటపుడు మాత్రం బాంబే హై కోర్ట్ కొన్ని ప్రత్యెక ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం ఈ వెబ్ సైట్ బ్లాక్ చేయబడింది  అనే సాధారణ సందేశం బదులు ఒక ప్రత్యేక మెసేజ్ ను ISP లు ఇవ్వవలసి ఉంటుంది. ఈ మెసేజ్ లో కాపీ రైట్ చట్టం లో ఉన్న నిబంధనలు, ఆర్డర్ లు నెంబర్ లతో సహా ఇంటర్ నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) లు డిస్ ప్లే చేయవలసి ఉంటుంది. దీనివలన అసలు ఆ పేజి ఎందుకు బ్లాక్ చేయబడిందో వీక్షకులకు తెలిసే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఏదో స్టూడియో చెప్పింది కదా అని వెబ్ సైట్ బ్లాక్ అని మెసేజ్ పెట్టేస్తే అవి చూసే వారికి అవి ఎందుకు బ్లాక్ చేయబడ్డాయో తెలిసే అవకాశం ఉండదు కదా! వారు తెలుసు కోవాలి కదా!

ఏది ఏమైనప్పటికీ ఈ కోర్ట్ ఉత్తర్వులకు టాటా స్పందించింది. ఇలా మెసేజ్ లు ఉంచడం సాంకేతికంగా సాధ్యం కాదని టాటా కోర్టు కు తెలిపింది. ఇది సాంకేతికంగా ఎందుకు సాధ్యం కాదో అది కూడా ఒక్క టాటా ISP కు మాత్రమే ఎందుకో గుర్తించింది. ఆర్డర్ లోని పాయింట్ 4 ప్రకారం టాటా తో రాజీ కి కోర్ట్ సమ్మతించింది. ఆర్డర్ లోని పాయింట్ 5 ప్రకారం ఇప్పుడు డిస్ ప్లే అవుతున్న మెసేజ్ కి కోర్ట్ అంగీకరించింది. అదికూడా కేవలం టాటా కు మాత్రమే. టాటా కు మాత్రమే ఎందుకో, మిగిలిన ISP లకు ఈ మెసేజ్ ఎందుకు డిస్ ప్లే కాదో కూడా ఆ మెసేజ్ లో స్పష్టo గా ఉంది. ఇంతకీ డిస్ ప్లే అవుతున్న మెసేజ్ ఏమిటి?

This URL has been blocked under the instructions of the Competent Government Authority or in compliance with the orders of a Court of competent jurisdiction. Viewing, downloading, exhibiting or duplicating an illicit copy of the contents under this URL is punishable as an offence under the laws of India, including but not limited to under Sections 63, 63-A, 65 and 65-A of the Copyright Act, 1957 which prescribe imprisonment for 3 years and also fine of upto Rs. 3,00,000/-. Any person aggrieved by any such blocking of this URL may contact at urlblock@tatacommunications.com who will, within 48 hours, provide you the details of relevant proceedings under which you can approach the relevant High Court or Authority for redressal of your grievance. 

ఒక్కసారి పై  మెసేజ్ ను స్పష్టంగా గమనిస్తే మనకు ఒక విషయ,అర్థం అవుతుంది. ఈ హెచ్చరిక అనేది చట్ట వ్యతిరేకంగా కాపీ రైటేడ్ అంశాలను చూసేవారికి మాత్రమే. అంటే పైరేటెడ్ కాంటెంట్ ఉన్న యుఆర్ఎల్ ని కేవలం చూసినంత మాత్రాన మీరు జైలు కి వెళ్ళడం అనేది ఏమీ ఉండదు. కానీ దానిని డౌన్ లోడ్ చేసుకుంటే మాత్రం జైలు కు వెళ్ళే అవకాశాలు ఉండవచ్చు. ఇక్కడ వచ్చిన కొత్త చట్టమేమీ లేదు. పైరసీ కి సంబందించిన మామూలు హెచ్చరిక నే ఇక్కడ కూడా ఉంచారు, కాకపోతే చట్టాలనూ, నియమాలనూ ప్రస్తావించారు అంతే!

సాఫ్ట్ వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ ఇండియా అనే ఒక టెక్నాలజీ సంబందిత సంస్థ యొక్క లీగల్ సలహాదారు అయిన ప్రశాంత్ సుగాథాన్ ఈ ప్రచారం గురించి ఈ విధంగా స్పందించారు.

“ఏ వెబ్ సైట్ నైనా కేవలం విజిట్ చేయడం అనేది నేరమీమే కాదు. ఒక వేళ అది బ్లాక్ చేయబడిన సైట్ అయినప్పటికీ కాపీ రైట్ చట్టం 1957 లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం చట్ట వ్యతిరేకం కాదు. చైల్డ్ పోర్నోగ్రఫీ కి మాత్రమే ఇందులో మినహాయింపు ఉంటుంది. కొన్ని కొన్ని టోరెంట్ సైట్ లు క్రియేటివ్ కామన్ లైసెన్స్ లకు లోబడి ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ నూ, సాహిత్య మరియు సృజనాత్మక సమాచారాన్ని అప్పుడప్పుడూ షేర్ చేస్తూ ఉంటాయి. “

అదన్నమాట విషయం. టోరెంట్ సైట్ లను ప్రోత్సహించడం లేదా వాటిని చూడమని చెప్పడం మా ఉద్దేశం కాదు గానీ ఈ ప్రచారం వెనుక ఉన్న వాస్తవాలను పాఠకులకు చెప్పడమే మా ప్రధాన ఉద్దేశం. ఏదైనా వార్త విడుదల అయినపుడు దాని పూర్వాపరాలు పరిశీలించకుండా వారికి తోచినది రాసేసి పాఠకులను భయబ్రాంతులకు గురి చేసే ఘనా పాటీ లైన సాంకేతిక సంపాదకుల బారి నుండి సగటు పాఠకుణ్ణి రక్షించడమే మా ధ్యేయం. ఆ దిశగా మా కంప్యూటర్ విజ్ఞానం ఎల్లప్పుడూ ముందు ఉంటుంది.

 

జన రంజకమైన వార్తలు