• తాజా వార్తలు

మీ స్మార్ట్ హోం డివైస్ లు ఎంతవరకూ సురక్షితంగా ఉన్నాయో తెలుసా?

సాధారణంగా అందరూ తమ కంప్యూటర్ లు మరియు స్మార్ట్ ఫోన్ లు, టాబ్లెట్ లను సెక్యూర్ గా ఉంచుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వీటిలో హ్యాకింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ. వీటి ద్వారా మన విలువైన సమాచారాన్ని హ్యాకర్లు తస్కరిస్తూ ఉంటారు. మాల్ వేర్ లు వీటిలో ప్రవేశించే అవకాశం ఎక్కువ. మరి స్మార్ట్ హోం డివైస్ ల పరిస్థితి ఏమిటి? అవి ఎంతవరకూ సురక్షితం? పైకి కనిపించకపోయినా కూడా స్మార్ట్ హోమ్ డివైస్ ల ద్వారా కూడా హ్యాకింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, మాల్ వేర్ లు ఈ డివైస్ లలోనికి ప్రవేశించి తద్వారా మన స్మార్ట్ ఫోన్ లు లేదా కంప్యూటర్ లలోనికి ప్రవేశించే అవకాశం ఉంది.

హ్యాకర్ లు స్మార్ట్ హోమ్ డివైస్ లను ఎందుకు టార్గెట్ చేస్తారు?

స్మార్ట్ లాక్ లు మరియు వైఫై కెమెరా లు లాంటి కొన్ని స్మార్ట్ హోమ్ లను హ్యాకర్ లు ఎక్కువగా టార్గెట్ చేస్తారు. మీ స్మార్ట్ లాక్ ను హ్యాక్ చేయడం ద్వారా మీ ఇంట్లో కి ప్రవేశించి చోరీ కి పాల్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కెమెరా ను హ్యాక్ చేయడం వలన మీ ఇంటి యందలి పరిస్థితులు మరింత స్పష్టంగా హ్యాకర్ లకు తెలుస్తాయి. 

స్మార్ట్ అవుట్ లెట్ లు, స్మార్ట్ థర్మో స్టాట్లు లాంటి స్మార్ట్ హోం డివైస్ లపై హ్యాకర్ లు ఎందుకు దాడి చేస్తారులే అని మీరు అనుకుంటారు, కానీ వాస్తవానికి హ్యాకర్  లు చేయవలసిందంతా వీటితోనే చేస్తూ ఉంటారు. ఉదాహరణకు మీ స్మార్ట్ అవుట్ లెట్ లు కనెక్ట్ అయి ఉన్న వై ఫై నెట్ వర్క్ లోనికి ప్రవేశించాలంటే హ్యాకర్ లు ఈ అవుట్ లెట్ లానే ఎంచుకుంటారు. ఈ స్మార్ట్ హోం అవుట్ లెట్ ల ద్వారా మీరు కనెక్ట్ అయి ఉన్న వైఫై నెట్ వర్క్ లోనికి ప్రవేశించి దానికి రిమోట్ యాక్సెస్ ను పొందగలుగుతారు. ఒక్కసారి హ్యాకర్ లు మన నెట్ వర్క్ కు రిమోట్ యాక్సెస్ ను పొందారు అంటే వారు ఇక ఏమేం చేయగలరో ప్రత్యేకించి చెప్పుకోవలసిన అవసరం లేదు.

అరక్షిత మైన డివైస్ అనేది అత్యంత సులువుగా ,మాల్ వేర్ బారిన పడుతుంది. దానివలన వీటిపై DDOS అటాక్ లు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ డివైస్ లు హ్యాకింగ్ అవడం వలన మీకేమీ నష్టం కలగక పోయినా వేరే యూజర్ లకు దీని వలన నష్హ్తం కలగవచ్చు. కాబట్టి మీరు మీ ఇంటర్ నెట్ కార్యకలాపాలు అన్నింటిలో సెక్యూర్ గా ఉంచుకోవడం ఆనేది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇలాంటి హ్యాక్ లు జరిగిన సందర్భాలు అనేకం.

సెక్యూర్ గా ఉండడం ఎలా?

దురదృష్టవశాత్తూ ప్రస్తుతం వస్తున్న అనేక స్మార్ట్ హోమ్ పరికరాలు ఉపయోగించడానికి చాలా సులువుగా ఉండే విధంగా డిజైన్ చేయబడ్డాయి. ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్ లు ఇందులో ఉండవు. కానీ మీ దగ్గర ఉన్న స్మార్ట్ హోం డివైస్ లలో ఏవి హ్యాకింగ్ చేయడానికి అనువుగా ఉన్నాయో మీరు చెక్ చేసి తెలుసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోవడం లో అతి సులువైన పద్దతి ఇంటర్ నెట్ అఫ్ థింగ్స్ స్కానర్ ను ఉపయోగించడం. ఈ స్కానర్ మీ నెట్ వర్క్ మొత్తాన్నీ స్కాన్ చేసి మీ పరికరాలు ఏవైనా శోధనలో ఉన్నాయేమో చూస్తుంది. శోధన్ అనేది పబ్లిక్ గా యాక్సేసబుల్ అయ్యే విధంగా ఉండే ఇంటర్ నెట్ డివైస్ లను చూపించే ఒక సెర్చ్ ఇంజిన్. సెక్యూరిటీ కెమెరా లు, ప్రింటర్ లు, రూటర్ లు మరియు ఇతర డివైస్ లను ఈ విధంగా మీరు స్కాన్ చేసి కనుక్కోవచ్చు.

ప్రస్తుతానికి ఈ పద్దతికి అతీతమైన పద్దతులు ఏవీ పెద్ద గా లేవు.తమ ఉత్పత్తులను సెక్యూర్ గా ఉంచడం అనేది ఆయా కంపెనీ లపైనే ఆధార పడి ఉంది.

ఏది ఏమైనప్పటికీ నెస్ట్, ఫిలిప్స్, అమజాన్ లాంటి టాప్ రాండ్ కంపెనీలు తమ ఉత్పత్తులను మోస్ట్ సేక్య్యోర్ గా ఉండేలా రూపొందించే పనిలో ఉన్నాయి. మే వైఫై నెట్ వర్క్ కు సెక్యూర్ పాస్ వర్డ్ లను సెట్ చేసుకోవడం ద్వారాకూడా మన స్మార్ట్ హోం డివైస్ లను సెక్యూర్ గా ఉంచుకోవచ్చు. 

జన రంజకమైన వార్తలు