• తాజా వార్తలు

హ్యాకింగ్ గురైన సమాచారం లభించే ప్రదేశం

మీకు ఆన్ లైన్ లో ఎకౌంటు ఉందా? అయితే ఇప్పటికే మీ ఎకౌంటు హ్యాకింగ్ కు గురి అయి ఉంటుంది. లేదా భవిష్యత్ లో హ్యాకింగ్ గురయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నమ్మబుద్ది కావడం లేదా? అయితే ఈ స్టొరీ చదవండి.మీకే తెలుస్తుంది.

ప్రస్తుతం టెక్ ప్రపంచం లో సుమారు ఒక బిలియన్ కు పైగా వెబ్ సైట్  లు హ్యాకింగ్ కు గురి అయినట్లు ఒక అంచనా. గూగుల్ పరిశోధనల ప్రకారం అయితే కనీసం 50 మిలియన్ ల వెబ్ సైట్  లు ఇప్పటికే హ్యాకింగ్ కు గురయ్యాయి. 2015 వ సంవత్సరం లో 17 మిలియన్ లు గా ఉన్నా ఇది నేడు ఒక బిలియన్ స్థాయికి చేరిందంటే ఏ రేంజ్ లో ఇది పెరిగి పోయిందో అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు మార్క్ జుకర్ బర్గ్ మరియు సుందర్ పిచాయ్ ల సోషల్ మీడియా ఎకౌంటు లు కూడా హ్యాక్ అయ్యాయంటే ఇక మీరే ఆలోచించండి.

సదరు ఇలా హ్యాకింగ్ చేయబడిన ఎకౌంటు వివరాలను ఏం చేస్తారు? అలా హ్యాకింగ్ గురైన మన వెబ్ సైట్ లేదా అకౌంట్ లోని మనకు సంబందించిన వివరాలు మనం తిరిగి పొందవచ్చా? అయితే ఎక్కడ?

ఇలా హ్యాకింగ్ ద్వారా అక్రమoగా తస్కరించిన సమాచారాన్నoతా వెబ్ లో విచ్చలవిడిగా వదులుతారు. మనకు కావాలంటే వెతుక్కోక తప్పని పరిస్థితి. కానీ ఎక్కడని వెతుకుతారు? ఎలా వెతుకుతారు? అలాంటి వారికోసమే ఒక వెబ్ సైట్ ఉంది. అదే Leakedsourc.com . ఈ వెబ్ సైట్ హ్యాకింగ్ గురి అయిన వెబ్ సైట్ లు మరియు అకౌంట్ ల యొక్క యూసర్ నేమ్ లూ, ఈమెయిలు అడ్డ్రెస్ లు  మరియు పాస్ వర్డ్ ల వివరాలన్నింటినీ ఒక సెర్చ్ ఇంజిన్ ద్వారా అందుబాటులో ఉంచుతుంది. 2015 అక్టోబర్ లో ఈ వెబ్ సైట్ స్థాపించబడింది. “2015 వ సంవత్సరం లో కొంతమంది మా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో మమ్మల్ని ఒక ప్రశ్న తరచుగా అడిగే వారు. హ్యాకింగ్ కు గురి అయిన మా సమాచారం మేము ఎక్కడ పొందగలం అని, ఆ సమాచారం పొందే స్థలం మా వెబ్ సైటే కావాలని మేము అప్పుడే నిర్ణయించుకున్నాం. అందుకే మేము ఈ వెబ్ సైట్ ను స్థాపించాము” అని ఈ వెబ్ సైట్ ఓనర్ చెబుతున్నారు.

ప్రస్తుతానికి ఈ వెబ్ సైట్ లో 2 బిలియన్ ఎకౌంటు లకు సంబందిచిన సమాచారం దాగిఉంది. ఈ వెబ్ సైట్ లో ప్రతి ఒక్కరి కి సంబందించిన డేటా అందుబాటులో ఉంది. విచిత్రమేమిటంటే హ్యాకర్ లకు సంబందించిన డేటా కూడా ఈ వెబ్ సైట్ లో ఉంది వారు కావాలని అనుకుంటే వారికి కూడా ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నట్లు ఈ వెబ్ సైట్ యజమానులు చెబుతున్నారు. అంతేగాక తమను తాము టెక్ పారిశుధ్య కార్మికులు లాగా వీరు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే లీక్ అయిన సమాచారం అందించడానికి ఇతర వెబ్ సైట్ లు అందుబాటులో ఉన్నప్పటికీ 100 శాతం ఖచ్చితత్వం తో ఇవ్వడమే తమ ప్రత్యేకత అని వీరు చెబుతున్నారు. కేవలం డబ్బు కోసమే గాక సామాజిక బాధ్యత తో కూడా తాము ఈ వెబ్ సైట్ ను స్థాపించినట్లు ఈ వెబ్ సైట్ నిర్వాహకులు చెబుతున్నారు.

మరి ఇంకెందుకు ఆలస్యం , మీ ఆన్ లైన్ అకౌంట్  లేదా వెబ్ సైట్ కూడా హ్యాకింగ్ కు గురి అయిందేమో ఒక సారి టెస్ట్ చేసుకోండి. కాకపోతే కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డాక్టర్ కు మనం ఫీజు చెల్లించాలి కదా మరి.

జన రంజకమైన వార్తలు