ప్రపంచంలోనే భయంకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్స్ సాంకేతికతను ఉపయోగించుకోవడంలో కూడా ముందుంటుంది. సాంకేతికత ఉపయోగించి ఎలాగైనా తమ ఉచ్చులోకి లాగాలని ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. తమ సిద్ధాంతాలను పిల్లలపై రుద్దడానికి ఈ ఉగ్రవాద సంస్థ సాంకేతికతను ఉపయోగిస్తోంది. దీనిలో భాగంగానే ఐఎస్ హురూఫ్ అనే యాప్‌ను తయారు చేసింది. ఐఎస్‌కు చెందిన లైబ్రరీ ఆఫ్ జీల్ అనే సంస్థ దీనిని తయారు చేసింది. పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారికి తీవ్ర వాద భావజాలాన్ని నూరిపోయడానికి ఈ యాప్‌ను ఉపయోగించాలనేది ఐఎస్ ఉద్దేశం. ఐఎస్ ప్రభావిత ప్రాంతాలైన సిరియా తదితర దేశాల్లో ఈ యాప్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ హురూఫ్ మెసెజింగ్ యాప్‌ను 62 మిలియన్ల యూజర్లు ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌ను ఉపయోగించి రోజుకు 10 బిలియన్ల మెసేజ్‌లు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయట. బెర్లిన్ బేస్డ్ స్టార్టప్ తయారు చేసిన ఈ యాప్ ఐఎస్ లక్ష్యాన్ని సాధించే దిశగా విజయవంతం అవుతుందని ఆ సంస్థ చెబుతోంది. ఐతే ఈ యాప్ విస్తరించకుండా, అది పని చేయకుండా చేయడానికి అమెరికా లాంటి అగ్ర రాజ్యాలు కంకణం కట్టుకున్నాయి. ఈ యాప్ మూలాలను కనిపెట్టి దాన్ని ఆపేయడానికి అవి తమ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. ఈ యాప్ మొత్తం అరబిక్ భాషతో రూపొందించారు. అరబిక్ భాషను పిల్లలకు నేర్పించడంతో పాటు వారికి తీవ్ర వాద భావజాలాన్ని అంటించడమే ప్రధాన లక్ష్యంగా ఈ యాప్ తయారు చేశారు. అంతేకాదు చిన్న పిల్లలకు రాకెట్ లాంచర్లు, గ్రెనెడ్లు, తుపాకులు ఎలా ఉపయోగించాలో చెప్పడం లాంటివి కూడా ఈ యాప్‌లో ఉన్నాయి. తమ భావజాలాన్ని విస్తరించడానికి ఐఎస్ తయారు చేసిన తొలి యప్ ఇదే. ప్రస్తుతం ఈ యాప్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. |