పసిగట్టిన తీవ్రవాద వ్యతిరేక నెట్ వర్క్ “ఘోస్ట్ సెక్యూరిటీ గ్రూప్” ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఇరాన్ and సిరియా (ఐసిస్) ఉగ్రవాద సంస్థ తన కార్యకర్తల మధ్య కమ్యూనికేషన్ కోసం “అల్ రావి”అనే ఒక సరికొత్త ఆండ్రాయిడ్ మెస్సేజింగ్ యాప్ ను క్రియేట్ చేసినట్లు సమాచారం. ఏ సామాజిక మాధ్యమాన్ని ఎంచుకున్నా ప్రభుత్వాలు సులువుగా పసిగట్టేస్తుండడం తో ఐసిస్ ఈ యాప్ కు రూప కల్పన చేసింది. ALRAWI అని పిలవ బడే ఈ ఆండ్రాయిడ్ మెస్సేజింగ్ యాప్ చాలా సెక్యూర్ గా ఉండడమే గాక నిఘా సంస్థలు పసిగట్టలేనంత పటిష్టంగా ఉంటుంది. మొట్టమొదటిగా ఈ యాప్ కు సంబందించిన సమాచారాన్ని తీవ్రవాద వ్యతిరేక నెట్ వర్క్ అయిన ఘోస్ట్ సెక్యూరిటీ గ్రూప్ పసిగట్టింది. మిగతా ఆండ్రాయిడ్ యాప్ ల లాగా ఇది గూగుల్ యాప్ స్టోర్ లో లభించదు. అంటే యాప్ స్టోర్ లో దీనిని డౌన్ లోడ్ చేయలేము. ఐసిస్ తన సభ్యులందరికీ ఒక కోడ్ ను ఇస్తుంది. ఆ కోడ్ ను ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఇది డౌన్ లోడ్ చేయబడుతుంది. తన సభ్యుల మధ్య కమ్యూనికేషన్ కోసం మరియు కొత్త సభ్యుల రిక్రూట్ మెంట్ కోసం ఐసిస్ ఉపయోగిస్తున్న AMAQ ఏజెన్సీ అనే మరో యాప్ ను కూడా ఘోస్ట్ సెక్యూరిటీ సర్వీసెస్ గత సంవత్సరం బహిర్గతం చేసింది. ఈ సరికొత్త యాప్ ప్రాథమికంగా ఐసిస్ భావజాల వ్యాప్తి కోసమే రూపొందించినా క్రమేపీ అది తన తాజా కార్యకలాపాలు మరియు వీడియో లను తన సభ్యులకు పంపించ డానికీ ఈ యాప్ ను ఉపయోగిస్తుంది. అంతేగాక ఐసిస్ యొక్క సభ్యులు ఏం చేయాలి? చేయకూడదు? తదితర విషయాలతో కూడిన ఒక బుక్ లెట్ ను కూడా ఐసిస్ విడుదల చేసింది. ఐసిస్ సభ్యులు తమ సహచర సభ్యులతో సంభాషణలు జరిపేటపుడు ఉపయోగించవలసిన టెక్ పరికరాలతో కూడిన సమాచారం కూడా ఈ బుక్ లెట్ లో ఉంటుంది. ఐసిస్ భావజాల వ్యాప్తికి అత్యున్నత స్థాయి మాధ్యమాలను ఉపయోగిస్తుంది. ఆ మాధ్యమాలు ఏ రేంజ్ లో ఉంటాయంటే FBI మరియు ఏ ఇతర ప్రభుత్వ సెక్యూరిటీ సంస్థలు కూడా వాటిని ట్రాక్ చేయలేనంత పటిష్టంగా ఉంటాయి.ఎందుకంటే ఐసిస్ కు సంబందించిన కొన్ని వేల ఎకౌంటు లను ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ లు తొలగించాయి. దీనితో రష్యా కు చెందిన టెలిగ్రామ్ మెసెంజర్ ను ఐసిస్ ఉపయోగించుకుంది. పారిస్ దాడుల తర్వాత దానిపై కూడా నిషేధం విధించడం తో అప్రమత్తమైన ఐసిస్ సరికొత్త మార్గాలను వెతుకుతూ ఈ పటిష్ట యాప్ ను రూపొందించినట్లు సమాచారం. ఇంకెన్ని మాధ్యమాలను ఈ తీవ్రవాద సంస్థ ఉపయోగించుకుంటుందో చూడాలి. |