• తాజా వార్తలు

ఎక్కడ మావోయిస్టులు ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్లలో సౌర విద్యుత్ మొబైల్ టవర్లు ...

మొదటి దశలో 2199 టవర్లు

హోం శాఖ , బీఎస్సెన్నెల్  గేం చేంజింగ్ ప్రణాలిక

 

ఇండియాలోని 1356 పోలీస్ స్టేషన్లలో వచ్చే మార్చి చివరి నాటికి మొబైల్ టవర్స్ ఏర్పాటు చేయబోతున్నారు. తొమ్మిది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో మొబైల్ కనెక్టివిటీ పెంచేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే... మావోయిస్టుల నుంచి మొబైల్ టవర్లకు నష్టం కలగకుండా వాటిని పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ బీఎస్సెన్నెల్ టవర్లే. మారుమూల ప్రాంతాలకు మొబైల్ ఫోన్ కనెక్టివిటీ పెంచే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 2199 టవర్లు నెలకొల్పాలని నిర్ణయించుకోగా ఈ మార్చినాటి ఈ 1356 ఏర్పాటు చేస్తారు.

మావోయిస్టు ప్రాంతాల్లో సెల్ టవర్లను తగలబెడుతుంటారు. దీంతో వాటిని కాపాడుకోవడం కష్టమైన పనన్న ఉద్దేశంతో ప్రయివేటు ఆపరేటర్లు కానీ, బీఎస్సెన్నెల్ కానీ అలాంటి ప్రాంతాల్లో నెట్ వర్క్ ను పెంచుకోవడం లేదు. దీంతో సమాచార వ్యవస్థ మారుమూల ప్రాంతాలకు చేరకపోవడం ఒక నష్టమైతే పోలీసులు, భద్రతా బలగాలకు కూడా సరైన కమ్యూనికేషన్లకు అవకాశం ఉండక మావోయిస్టుల ఏరివేతలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో హోం శాఖ చొరవ తీసుకుని బీఎస్సెన్నెల్ టవర్లను పోలీస్ స్టేషన్లలో కానీ, భద్రతా బలగాల బెటాలియన్లు ఉండే చోట్ల కానీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ఈ కొత్త టవర్లకు సౌర విద్యుత్ ను అందిస్తారు. కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు.. ఇంకా కొన్ని చోట్ల అసలు కరెంటే లేకపోవడం వంటి కారణాలతో సౌర విద్యుత్ వైపు మళ్లారు. బీహార్, చత్తీస్ గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో అత్యంత తీవ్ర నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన 35 చోట్ల వీటిని నెలకొల్పుతారు. అందులో అత్యధికంగా 700 టవర్లు జార్ఖండ్ లోనే ఏర్పాటుకానున్నాయి.

కాగా గత కొద్దికాలంగా తొమ్మిది మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో 200 టవర్లను మావోయిస్టులు తగలబెట్టేశారు. ఇన్ఫార్మకు సెల్ ఫోన్లు ఇచ్చి తాము ఎక్కడున్నామన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని ఎన్ కౌంటర్లకు దిగుతున్నారని ఆరోపిస్తూ... అందుకు కారణమైన మొబైల్ టవర్లను పేల్చేస్తున్నారు మావోయిస్టులు. దాంతో ఇప్పు డు వాటిని ఏకంగా పోలీస్ స్టేషన్లలోనే నెలకొల్పబోతున్నారు. 

 

జన రంజకమైన వార్తలు