ప్రతి ఒక్కరి చేతిలో స్మార్టు ఫోనే. అందులోనూ నూటికి 80 ఆండ్రాయిడ్ మొబైళ్లే. ఇలా ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతున్నవారందరికీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం తాజాగా ఓ హెచ్చరిక చేస్తోంది. రాన్సమ్ వేర్ అటాక్స్ కు మీరే నెక్ట్సు టార్గెట్ అని చెబుతోంది. భారీ సైబర్ దాడి ముప్పు మళ్లీ పొంచి ఉందని.... ఈసారి టార్గెట్ స్మార్టుఫోన్లేనని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ డైరెక్టర్ సంజయ్ బహాల్ హెచ్చరించారు.
ఆపుతారా.. జోరు చూపుతారా?
గత శుక్రవారం నుంచి పంజా విసురుతున్న వానా క్రై అటాక్ కంటే ఇవి మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మొబైల్స్ లో అత్యధికులు వాడేది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమే. ఒకవేళ హ్యాకర్లు కనుక దీన్నే టార్గెట్ చేస్తే, ప్రపంచమంతా ఏమవుతుందో కూడా అర్థం కావడం లేదని సంజయ్ చెప్పారు. హ్యాకర్లు రెండు దశలో ముందుకు వెళ్తున్నారని, అయితే తర్వాత ఏంటన్నది తెలియడం లేదని చెప్పారు. ఒకవేళ ఈ అటాక్స్ ను ఆపవచ్చు లేదా వేరియంట్లను టార్గెట్ చేసి మరోమారు తమ ప్రతాపం చూపవచ్చని తెలిపారు.
అందరికీ అలర్ట్స్...
బ్యాంకులకు, పవర్ యుటిలిటీస్ కు, రైల్వేస్, ఇతర కీలక ఇన్ ఫ్రాక్ట్ర్చర్ ప్రొవేడర్లకు అలర్ట్ లు పంపుతూనే ఉన్నామని, తర్వాత అటాక్ కు ముందస్తుగా ప్రైవేట్ వ్యక్తులతో డైరెక్ట్ గా సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. అంతేకాదు... వానా క్రై అటాక్ పై అధ్యయనం చేయడానికి ఏజెన్సీ ఓ టీమ్ కూడా నియమించింది. హ్యాకర్లు తర్వాతి టార్గెట్ స్మార్ట్ ఫోన్లే అయితే ఏం చేయాలనే విషయంలో ఈ టీం కసరత్తు చేస్తోంది.