• తాజా వార్తలు

1,25,000 పైగా ఎకౌంటు లను బ్లాక్ చేసిన ట్విట్టర్ ...

ఐసిస్ తీవ్రవాదులకు ఉపయోగ పడుతున్న వని అనుమానం  

ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు తమ కార్యకలాపాలకు సోషల్ మీడియా ను ఉపయోగించుకుంటున్నారనే విషయం మనందరికీ తెలిసినదే. ఈ వార్తలతో జాగ్రత్త పడిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉందని అనుమానిస్తున్న 1,25,00౦ కు పైగా ఎకౌంటు లను బ్లాక్ చేసేసింది. ఈ ఎకౌంటు లను బ్లాక్ చేయడానికి 2015 వ సంవత్సరం మధ్యనుండీ ట్విట్టర్ వీటి పై ఓ  కన్నేసి ఉంచింది. అంతేగాక వీటిని నిషేధించాలని ప్రభుత్వాల వైపు నుండి తీవ్రమైన ఒత్తిడి కూడా ట్విట్టర్ పై ఉంది. ప్రపంచం నలుమూలల ఉన్న అనేక మంది ప్రజలు ఈ తీవ్రవాద గ్రూపులు చేస్తున్న ఘోరకార్యాలతో భయకంపితులు అవుతున్నారు. ఈ విధమైన తీవ్రవాద అనుకూల కార్యకలాపాలను తాము వ్యతిరేకిస్తున్నామనీ , అంతేగాక ట్విట్టర్ యొక్క నియమ నిబంధనలు దీనికి పూర్తి వ్యతిరేకమనీ ట్విట్టర్ ప్రతినిధులు చెబుతున్నారు.

సామాజిక మాధ్యమాల ద్వారా తీవ్రవాద కార్యకలాపాల వ్యాప్తినీ మరియు వాటి భావజాల వ్యాప్తినీ అరికట్ట వలసిందిగా అమెరికా మరియు ఇతర ప్రభుత్వాలు ఈ సామాజిక మాద్యమాలను గత కొంత కాలం నుండీ అడుగుతూ వస్తున్నాయి.  ఈ నేపథ్యం లోనే ఆ ఎకౌంటు లను బ్లాక్ చేస్తున్నట్లు ట్విట్టర్ వైపు నుండి ప్రకటన వచ్చింది.

చాలా మంది నిపుణులు మరియు కంపెనీలు చేబుతునట్లు ట్విట్టర్ లో ఉన్న తీవ్రవాద అనుకూల సమాచారాన్ని గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ లు లేదా అల్గోరిథం లు ఏవీ లేవనీ అయినప్పటికీ తమ దగ్గర ఉన్న అతి కొద్ది సమాచారం మరియు ఆధారాల తోనే తాము ముందుకు వెళ్తున్నట్లు ట్విట్టర్ చెబుతుంది. అంతేగాక ఇది చాలా సవాళ్ళ తో కూడుకున్న అంశం కాబట్టి ముందుగా తమ నియమ నిబంధనలను మరింత కఠిన తరం చేయనున్నమనీ మరియు తీవ్రవాద అనుకూల సమాచారాన్ని ఏరివేయడం లో తమ తో పాటు కలిసి వచ్చే ఏజెన్సీ ల సహాయం కూడా తీసుకోనున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది.

 

జన రంజకమైన వార్తలు