• తాజా వార్తలు

ఇండియాలో మరో కొత్త వైరస్ ‘ఎన్ క్లే’.. జొమాటోలో 1.7 కోట్ల యూజర్ల డాటాపై అటాక్



ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్ అటాక్స్ ఇండియాలో బిగ్గెస్ట్ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ సర్వీస్ జొమాటోపైనా పడగ విప్పాయి. అయితే... ఈ దాడిలో ఏ ఒక్క యూజర్ కు చెందిన ఆన్ లైన్ పేమెంట్ డాటాను కూడా హ్యాకర్లు దొంగిలించలేకపోయారు. దీంతో తమ యూజర్ల క్రెడిట్, డెబిట్ కార్డుల డాటా ఏమాత్రం లీకవలేదని జొమాటో ప్రకటించింది.

అయితే, జొమాటో డాటాబేస్ లోని 1.7 కోట్ల మంది వినియోగదారులకు చెందిన యూజర్ నేమ్స్, హ్యాష్డ్ పాస్ వర్డ్డ్స్ ను మాత్రం హ్యాకర్లు చోరీ చేయగలిగారు. గురువారం జరిగిన ఈ దాడి ఫలితంగా కంపెనీ వెంటనే స్పందించి ఎఫెక్టయిన యూజర్ల అందరి పాస్ వర్డ్ లను రీసెట్ చేయించింది. ఎన్ క్లే అనే డార్క్ వెబ్ ఈ దాడికి బాధ్యత వహించింది. అయితే... ఈ దొంగిలించిన యూజర్ నేమ్స్, పాస్ వర్డ్ లను సుమారు వెయ్యి డాలర్లకు హ్యాకర్లు అమ్ముకునే ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడినట్లు ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది.

తాజా దాడి నేపథ్యంలో జొమాటో స్పందిస్తూ... ఒకట్రెండు రోజుల్లో తమ వెబ్ సైట్, యాప్ లను మరింత సురక్షితంగా మార్చేలా సెక్యూరిటీ వ్యవస్థను డెవలప్ చేయనున్నట్లు తెలిపింది. సెక్యూరిటీ పరంగా మరో ఆథరైజేషన్ లేయర్ యాడ్ చేసి డాటా బ్రీచ్ కు ఏమాత్రం అవకాశం లేకుండా చేస్తామని వెల్లడించింది.

జన రంజకమైన వార్తలు