• తాజా వార్తలు

రాన్సమ్ వేర్ నెక్ట్స్ టార్గెట్ మీ మొబైల్ ఫోనే


కొన్ని యూరోపియన్ దేశాలతో పోల్చితే ఇండియాలో రాన్సమ్ వేర్ అటాక్ తీవ్రత తక్కువే. అయితే... అప్పుడే సంబరపడిపోవద్దని, ఏమాత్ర అజాగ్రత్త తగదని... భారీ ముప్పు ముంచుకొస్తోందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం డైరెక్టర్ జనరల్ సంజయ్ బహల్ హెచ్చరిస్తున్నారు. మీ జేబులోని మొబైల్ ఫోనే రాన్సమ్ వేర్ కు నెక్ట్స్ టార్గెట్ అని చెప్తున్నారు.

వానా క్రై వైరస్ ప్రభావం మన దేశంలో చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా మున్ముందు కూడా ఇలాగే ఉదాసీనంగా ఉంటామంటే కుదరదని.. సైబర్ సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన వైరస్ అటాక్స్ ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు... అత్యధిక స్మార్టు ఫోన్లలో ఉండే ఆండ్రాయిడ్ ఓఎస్ ను టార్గెట్ చేస్తూ భవిష్యత్తు అటాక్స్ ఉంటాయని చెప్తున్నారు.

ఒకవేళ హ్యాకర్లు కనుక ఆండ్రాయిడ్ ను టార్గెట్ చేస్తే, కోట్లాది ఫోన్లు ఎందుకూ పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. హ్యాకర్లు ఎప్పుడేం చేస్తారో చెప్పలేమని.. వారు ఈ అటాక్స్ కొన్నాళ్ల పాటు ఆపొచ్చని లేదంటే వేరే వెర్షన్ల వైరస్ లతో విరుచుకుపడే ప్రమాదమూ ఉందని ఆయన తెలిపారు. బ్యాంకులకు, పవర్ యుటిలిటీస్ కు, రైల్వేస్, ఇతర కీలక ఇన్ ఫ్రాక్ట్ర్చర్ ప్రొవైడర్లకు ముందస్తు హెచ్చరికలు పంపుతున్నామని... సంస్థలకే కాకుండా ప్రైవేట్ వ్యక్తులకూ ఇలాంటి దాడుల గురించి ముందుగానే సమాచారం ఇచ్చే వ్యవస్థను రూపొందిస్తున్నామని ఆయన చెబుతున్నారు.

జన రంజకమైన వార్తలు