ఆన్‌లైన్ అంటేనే మోసాలకు ఒక అడ్డా.. మనం ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా చిటికెలో మోసం చేసే నేరగాళ్లు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ఈకామర్స్ సైట్లలో మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్ద పెద్ద సైట్ల విషయాన్ని పక్కనపెడితే కొన్ని చిన్న సైట్లు కస్టమర్లను మోసం చేసి వారి దగ్గర నుంచి బాగా డబ్బులు గుంజుతున్నాయి. ఈ నేపథ్యంలో స్నాప్‌డీల్ ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్ ఫేక్ వెబ్‌సైట్లు,. ఎస్ఎంఎస్‌ల గురించి హెచ్చరించింది. ఈ స్కాముల్లో పడకుండని జాగ్రత్తలు చెప్పింది. అవేంటో చూద్దామా..
ఆఫర్ల ఆశ చూపి..
ఇటీవల చాలా సైట్లు డిస్కౌంట్లు, ఆఫర్ల పేరిట మోసాలు చేస్తున్నాయి. అసలు ధర బాగా పెంచేసి ఆ తర్వాత తగ్గిస్తున్నట్లుగా ప్రకటనలు ఇచ్చి కస్టమర్లను ముగ్గులోకి దింపుతున్నాయి. ఇటీవల స్నాప్‌డీల్ పేరిట కొన్ని ఫేక్ వెబ్‌సైట్లు ఇలాగే కస్టమర్లను మోసం చేశాయి. రకరకాల ఆఫర్లు చెప్పి వినియోగదారులను మభ్యపెట్టి వారిని తప్పుడు మార్గాల్లో మళ్లించాయి. ఇది నమ్మిన కస్టమర్లు వారు చెప్పినట్లుగానే డబ్బులు ఇవ్వడం మోసపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తాము ఎలాంటి స్కీమ్‌లు ఆఫర్ చేయట్లేదని.. తాము పంపినట్లుగా ఎవరైనా కాల్స్, ఎస్ఎంఎస్‌లు, వాట్సప్, ఫేస్‌బుక్ మెసేజ్‌లు పెడితే పట్టించుకోవద్దని హెచ్చరించింది.
డూస్ అండ్ డోన్ట్స్
1. ప్రైజ్‌లు వచ్చాయని.. మీకు ఆఫర్‌లో డబ్బులు, క్యాష్‌బాక్ వచ్చాయని ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే నమ్మొద్దు. కచ్చితంగా ఇది మోసపూరితమైన చర్యలే.
2. మీ ఫోన్ నంబర్, ఆధార్ నంబర్, ఇతర ఐడీ కార్డ్స్ వివరాలు లాంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయకూడదు. ముఖ్యంగా స్నాప్‌డీల్ పేరుతో వచ్చే వారికి మీరు ఏ వివరాలూ చెప్పొద్దు. వారు పంపే ఎలాంటి లింక్స్ క్లిక్ చేయకూడదు
3. మీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్‌ను షేర్ చేయకూడదు. అంటే డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్లు, సీవీవీ నంబర్లు, బ్యాంక్ అకౌంట్ల నంబర్లు మీరు అపరిచితులకు చెప్పకూడదు.
4. ఓటీపీలని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. మీ వ్యాలెట్ వివరాలను ఎవరికీ చెప్పకూడదు.