• తాజా వార్తలు

సైబర్ దాడుల బారిన పడుతున్న భారతీయులు-స్మార్ట్ ఫోన్ తో తస్మాత్ జాగ్రత్త

మీరు విపరీతంగా స్మార్ట్ ఫోన్ ను వాడుతున్నారా?

రాత్రింబవళ్ళు తీరిక లేకుండా మొబైల్ లో ఇంటర్ నెట్ బ్రౌసింగ్ చేస్తున్నారా?

అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు సైబర్ ఎటాక్ దాడిన పడే అవకాశం నూటికి నూరు శాతం ఉంది. దీనిపై మీకు ఇప్పటికే ఒక అవగాహనా ఉందా? లేదా? అయినా సరే ఒక్కసారి ఈ వ్యాసం చదవండి. నిజం ఏంటో మీకే తెలుస్తుంది. దాదాపు సగం మంది భారత నెట్ యూసర్ లు సైబర్ ఎటాక్ బారిన పడనున్నారా?

డిజిటల్ ఇండియా ప్రమోషన్ లో భాగంగా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రజలకు దీనిపై అవగాహనా కల్పించే భాద్యతను మంత్రిత్వ శాఖల పై ఉంచారు. ఇదంతా ప్రచారం కోసం జరగటం లేదు. దేని వెనుక ఒక మహోన్నత  లక్ష్యం, ఉద్దేశ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. భారత ప్రభుత్వం లోని అన్ని శాఖలను సాంకేతిక పరిజ్ఞానం తో అనుసంధానం చేయడం, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ ను బలోపేతం చేయడమే దీని ప్రధాన లక్ష్యం. దేశం లోని మారుమూల గ్రామీణ ప్రాంతాలను కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ తో ప్రభుత్వానికి అనుసంధానం చేయడం కూడా దీని మరొక లక్ష్యం. తద్వారా ప్రజల యొక్క విద్య, ఆరోగ్యం, వినోదం, వ్యాపారం లాంటి రంగాలలో గణనీయమైన అభివృద్ధి ని సాధించే అవకాశం ఉంది. దీనితో దేశ ఆర్థిక వృద్ది సరికొత్త రెక్కలు తొడుగుకొనే అవకాశం ఉంది. అంత వరకూ బాగానే ఉంది కానీ వాస్తవిక పరిస్థితి ఎలా ఉంది? మన దేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ అంత బలంగా ఉందా? సైబర్ నేరాలపై తగినంత అవగాహన ప్రజలలో కలిగించడం లో ప్రభుత్వం సఫలం అయిందా అంటే ఖచ్చితంగా లేదనే సమాధానం వస్తుంది.

ఈ మధ్యనే చేసిన ఒక సర్వే ప్రకారం దేశం లోని ఇంటర్ నెట్ వినియోగ దారులలో అత్యధిక శాతం మంది తమ బ్యాంకు ఖాతాల యొక్క వివరాలను ఇతరులతో పంచుకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. డబ్బులు ఆదా చేసుకోవడానికి రక్షణ లేని సైట్ లనుండి యాప్ లనూ, మ్యూజిక్ నూ, సినిమా లనూ డౌన్ లోడ్ చేసుకుంటూ ఇన్స్టాల్ చేసుకుంటూనే ఉన్నారు. వారి రక్షణను,ప్రైవసీ నీ తమంత తామే ప్రమాదం లోనికి నెట్టి వేసుకుంటున్నారు.

 

జన రంజకమైన వార్తలు