• తాజా వార్తలు

పాస్ వర్డ్ మేనేజర్ ల గురించి మనం తెలుసుకోవలసిన వాస్తవాలు

 

నలో చాలా మంది సాధారణంగా చాలా బలహీనమైన పాస్ వర్డ్ లను ఉపయోగిస్తూ ఉండడమే గాక  వాటిని వివిధ వెబ్ సైట్ లలో తిరిగి ఉపయోగిస్తూ ఉంటారు. దృఢమైన పాస్ వర్డ్ లను క్రియేట్ చేసుకోవడం లేదా ఒక్కో వెబ్ సైట్ కూ ఒక్కో పాస్ వర్డ్ ను సెట్ చేసుకోవడం అనేది ఏమంత సులభమైన పనికాదు. కాబట్టి ఈ ప్రక్రియను సులభతరం చేయాలంటే ఉన్న ఏకైన మార్గం పాస్ వర్డ్ మేనేజర్ ను ఉపయోగించడం. మీరు లాగ్ ఇన్ అయ్యే ప్రతీ వెబ్ సైట్ కు చెందిన సమాచారాన్ని భద్రంగా ఉంచడమే గాక  ఆయా వెబ్ సైట్ లకు మీరు ఆటోమాటిక్ గా లాగ్ ఇన్ అయ్యే విధంగా ఈ పాస్ వర్డ్ మేనేజర్ సహాయపడుతుంది.  ఇవి ఒక మాస్టర్ పాస్ వర్డ్ ను ఉపయోగించి మీ పాస్ వర్డ్ డేటా బేస్ ను ఎన్ క్రిప్ట్ చేస్తుంది. మీరు ఈ ఒక్క మాస్టర్ పాస్ వర్డ్ ను గుర్తు ఉంచుకుంటే చాలు.

 

పాస్ వర్డ్ లను రీ యూజ్ చేయకూడదు

ప్రత్యేకించి పెద్ద పెద్ద వెబ్ సైట్ లను ఉపయోగించేటపుడు మన పాస్ వర్డ్ లను పదేపదే ఉపయోగించడం అనేది ఏమంత శ్రేయస్కరం కాదు. మీ పాస్ వర్డ్ లు లీక్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీనిద్వారా మీ ఎకౌంటు లలోనికి చొరబడి మీ డేటా ను తస్కరించే అవకాశం ఉంటుంది.ఒకవేళ మీరు అన్ని వెబ్ సైట్ లకూ ఒకే పాస్ వర్డ్ ను ఉపయోగిస్తూ ఉన్నట్లయితే మీ డేటా లేదా ప్రైవసీ మరింత ప్రమాదం లో ఉన్నట్లే. ఎవరైనా మీ పాస్ వర్డ్ ను ఉపయోగించి మీ ఎకౌంటు లోనికి ఎంటర్ అయినట్లయితే వారు మీ పాస్ వర్డ్ ను రీసెట్ చేయగలరు. ఇక ఆ తర్వాత మీరు ఎప్పుడూ మీ ఎకౌంటు లోనికి లాగ్ ఇన్ అవలేరు. ఒకవేళ అది మీబ్యాంకు ఎకౌంటు అయినట్లయితే ఇక అంతే సంగతులు. కాబట్టి పాస్ వర్డ్ ను రీ యూజ్ చేయడం అనేది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి.

పాస్ వర్డ్ లు లీక్ అయ్యే ప్రమాదం నుండి పాస్ వర్డ్ మేనేజర్ ను ఉపయోగించడం వలన నిరోధించవచ్చు. ఒక్కో వెబ్ సైట్ కూ ఒక్కో రకమైన పాస్ వర్డ్ ను ఉపయోగించాలి. ఈ పాస్ వర్డ్ లు వీలైనంత స్ట్రాంగ్ గా అంటే పొడవుగా, ఊహించని రీతిలో సంఖ్యలు , సంకేతాలు మరియు అక్షరాల కలబోత తో ఏర్పాటుచేసుకోవాలి.

 

పాస్ వర్డ్ మేనేజర్ ను ఉపయోగించడం ఎలా?

ఖచ్చితంగా ఇది మీ మెదడు పై ఒత్తిడి ను తగ్గిస్తుంది. ఎందుకంటే అన్ని రకాల వెబ్ సైట్ లను ఉపయోగించేటపుడు వాటి పాస్ వర్డ్ లను గుర్తు ఉంచుకోవాలి అంటే మీ మెదడు పై అదనపు భారం వేయడమే కదా! అదే పాస్ వర్డ్ మేనేజర్ వలన ఆ ఒత్తిడి ని వీలైనంత తగ్గించుకోవచ్చు. ఇక ఈ సారి నుండీ ఏదైనా వెబ్ సైట్ ను ఉపయోగించే ప్రతీసారీ మీ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా పాస్ వర్డ్ మేనేజర్ ను ఓపెన్ చేసి మీ మాస్టర్ పాస్ వర్డ్ ను ఓపెన్ చేస్తే చాలు ఆటోమాటిక గా ఆ వెబ్ సైట్ కు మీకు యాక్సెస్ లభిస్తుంది. మీరు అప్పటికే పాస్ వర్డ్ మేనేజర్ ను ఉపయోగిస్తూ ఉన్నట్లయితే మీ డేటా ను ఆటోమాటిక్ గా తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఏదైనా కొత్త ఎకౌంటు ను క్రియేట్ చేసేటపుడు ఒక సెక్యూర్ రాండం పాస్ వర్డ్ ను జనరేట్ చేసుకునే ఆప్షన్ ను ఇది అందిస్తుంది. ఇకనుండీ మీరు పాస్ వర్డ్ ను గుర్తు ఉంచుకోవడానికి కంగారు పడాల్సిన అవసరం లేదు.

 

బ్రౌజర్ బేస్డ్ పాస్ వర్డ్ లను ఎందుకు ఉపయోగించకూడదు.

ఫైర్ ఫాక్స్ మరియు ఇతర వెబ్ బ్రౌజర్ లు కొన్ని ఇంటిగ్రేటెడ్ పాస్ వర్డ్ మేనేజర్ లను కలిగిఉంటాయి.  వీటిలో ప్రతీ బ్రౌజర్ కూడా ఇన్ బిల్ట్ పాస్ వర్డ్ మేనేజర్ లను కలిగిఉంటాయి. అయితే ఇవి మామూలు పాస్ వర్డ్ మేనేజర్ లతో ఏమాత్రం పోటీ పడలేవు. ఇవి మీ పాస్ వర్డ్ లను అన్ ఎన్ క్రిప్టేడ్ ఫాం లో ఉంచుతాయి. ఇలాంటి పాస్ వర్డ్ లను ఉపయోగిస్తే మీ ఎకౌంటు లో హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఒక మాస్టర్ పాస్ వర్డ్ తో కూడిన పాస్ వర్డ్ మేనేజర్ ను అందిస్తుంది. కానీ ఇది మీ పాస్ వర్డ్ లను అన్ ఎన్ క్రిప్టేడ్ ఫార్మాట్ లో ఉంచడం వలన ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. రాండం పాస్ వర్డ్ లను జనరేట్ చేసుకోవడానికి వేలు లేకుండా దీని ఇంటర్ ఫేస్ ఉంటుంది. క్రాస్ ఫ్లాట్ ఫాం సింకింగ్ లాంటి ఫీచర్ లు ఏవీ ఇందులో ఉండవు.

 

మరి వీటిని ఉపయోగించాలి?

ప్రస్తుతం అనేక రకాల పాస్ వర్డ్ మేనేజర్ లు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే అత్యుత్తమ ప్రమాణాలను కలిగి ఉంటాయి. ఇలాంటి వాటిలో ఒక మూడింటిని ప్రముఖం గా చెప్పుకోవచ్చు. వాటి గురించి చూద్దాం.

 

Dashlane

ఇది ఒక కొత్త పాస్ వర్డ్ మేనేజర్. కానీ ఇందులో అనేక విశిష్ట ఫీచర్ లు ఉంటాయి. విండోస్, OS x , ఐ ఫోన్, ఆండ్రాయిడ్, మరియు ఇతర అన్ని ఫ్లాట్ ఫాం లకూ యాప్ ను కలిగిఉంటుంది.  వివిధ రకాల బ్రౌజర్ లలో ఇవి ఎక్స్ టెన్షన్ లను కలిగిఉంటాయి. మీ అన్ని పాస్ వర్డ్ లనూ విశ్లేషించే ఒక సెక్యూరిటీ డాష్ బోర్డు ను ఇది కలిగిఉంటుంది. మీరు మీ పాస్ వర్డ్ లను మార్చు కోవడానికి ఆటోమాటిక్ పాస్ వర్డ్ చెంజర్ అనే ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది.ఇందులో ఉండే మరొక విశిష్ట మైన ఫీచర్ ఏమిటంటే ఒకే పరికరం లో వాడడానికి ఇది పూర్తీ ఉచితంగా లభిస్తుంది. ఒకవేళ వివిధ అరికరాలలో మీ పాస్ వర్డ్ లను  సింక్ చేయాలి అనుకుంటే ప్రీమియం వెర్షన్ కు అప్ గ్రేడ్ అవ్వవచ్చు. ఇక సెక్యూరిటీ విషయానికొస్తే మీ పాస్ వర్డ్ లన్నింటినీ క్లౌడ్ లో స్టోర్ చేసుకునే బదులుగా మీ కంప్యూటర్ లోనే స్టోర్ చేసుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది.

 

Lastpass

ఇది ఒక క్లౌడ్ బేస్డ్ పాస్ వర్డ్ మేనేజర్. ఇది ఎక్స్ టెన్షన్ లూ, మొబైల్ యాప్ లూ, మరియు ప్రతీ బ్రౌజర్ కూ , OS కూ డెస్క్ టాప్ యాప్ లనూ కలిగిఉంటుంది.  ఇది చాలా పవర్ ఫుల్ అప్లికేషను. ఇది టు ఫాక్టర్ అధేంటికేషన్ ను అందిస్తుంది. దీనివలన మీరు తప్ప మరెవరూ మీ చ్కోంట్ లోనికి లాగ్ ఇన్ అవలేరు. ఇది మీ పాస్ వర్డ్ లన్నింటినీ ఎం క్రిప్టేడ్ ఫాం లో సర్వర్ లో స్టోర్ చేస్తుంది.

 

కీ పాస్ keepass

ఇది ప్రతీ ఒక్కరికీ సరిపోయే ఫార్మాట్ లో లభిస్తుంది. కొంతమంది క్లౌడ్ బేస్డ్ పాస్ వర్డ్ మేనేజర్ తో అంత సౌకర్యవంతంగా ఉండరు. అలాంటివారికి ఇది బాగా ఉపయోగపడగలదు. ఇది మీ పాస్ వర్డ్ లను మేనేజ్డ్ ఫాషన్ లో ఉంచుతుoది. ఇది మొబైల్ యాప్స్ తో కూడిన బ్రౌజర్ ఎక్స్ టెన్షన్ లను కలిగి ఉంటుంది. ఇది మీ పాస్ వర్డ్ లను మీ సొంత కంప్యూటర్ లో స్టోర్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తుంది. ఇది వివిధ పరికరాల మధ్య సింక్ అవ్వదు.

జన రంజకమైన వార్తలు