• తాజా వార్తలు

ఎటువంటి పరిస్తితులలోనూ హ్యాక్ అవకుండా ఉండాలనుకుంటున్నారా ? ఐతే ఈ అల్టిమేట్ టిప్స్ మీకోసం

నేటి టెక్ ప్రపంచం లో హ్యాకింగ్ అనేది ఒక సీరియస్ విషయం అయ్యింది అంతేగాక చాలామంది వినియోగదారులకు ఇది ఒక పీడకల గా మారింది. హ్యాకర్ లు అనేక రకాలుగా మనకు సంబందించిన రహస్య సమాచారాన్ని అంతటినీ తెలుసుకుని హ్యాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ హ్యాకర్ ల బారినుండి పెద్దపెద్ద సంస్థలే తప్పించుకోలేకపోతున్నాయి ఇక మామూలు వినియోగదారుని పరిస్థితి ఏమిటి? ఈ పరిస్థితులలో హ్యాకర్ ల బారిన పడకుండా ఉండాలంటే ఒక సాధారణ వినియోగదారుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి  ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది. అవేంటో చూద్దాం.

లేటెస్ట్ సెక్యూరిటీ ప్రోగ్రాం లనే ఉపయోగించండి.

టెక్నాలజీ అనేది ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటుంది. ప్రతీ నిమిషానికీ టెక్నాలజీ అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి మీ సిస్టం లేదా ఫోన్ లలో వాడే యాంటి వైరస్ లేదా యాంటి మాల్ వేర్ లేదా యాంటి స్పై వేర్ లు ఎప్పటికప్పుడు అప్ డేట్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఫైర్ వాల్ ను తేలికగా తీసుకోకూడదు. నయం చేయడం కంటే అసలు రాకుండా చేయడమే మంచిది అనే సామెత మనకు తెలుసు కదా! అలాగే మన కంప్యూటర్ లలో నికి వైరస్ వచ్చిన తర్వాత బాధ పడే కంటే ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ ప్రోగ్రాం లను ఉపయోగించడం ద్వారా అసలు వైరస్ ను రాకుండా చేయడమే మంచిది కదా!

మీ OS లేదా  ఫర్మ్ వేర్ ను అప్ డేట్ గా ఉంచుకోండి.

ఇది ఏమంత తేలికగా తీసుకునే విషయం కాదు. మీరు తరచుగా మీ ఆపరేటింగ్ సిస్టం మరియు సాఫ్ట్ వేర్ లను అప్ డేట్ చేస్తూ ఉండాలి. ఆపరేటింగ్ సిస్టం ల యొక్క లేటెస్ట్ అప్ డేట్ లు హ్యాకర్ లకు అంతగా అనుకూలించవు. మీరు చాలా సులభంగా మైక్రో సాఫ్ట్ ప్రోడక్ట్ అప్ డేట్స్ ను ఆప్ట్ చేసుకోవచ్చు తద్వారా మీ ఆఫీస్ పేజి స్థిరంగా అప్ డేట్ అవుతూ ఉంటుంది.

ప్యాడ్ లాక్ గురించి జాగ్రత్త గా ఉండండి.

ఈ రోజుల్లో ఆన్ లైన్ షాపింగ్ అనేది బహుళ ప్రాచుర్యం పొందింది. కానీ దీనిని ఉపయోగించేటపుడు దీని పర్యవసానాల గురించి కూడా మీకు ఒక అవగాహన ఉండడం మంచిది. ఎప్పుడైనా మీరు సోషల్ మీడియా, బ్యాంకింగ్ వెబ్ సైట్ లు, ఆన్ లైన్ షాపింగ్, ఈ మెయిల్ తదితర సర్వీస్ లను ఉపయోగించేటపుడు ప్యాడ్ లాక్ సింబల్ ను గమనించాలి. అంటే మీరు ఓపెన్ చేసే వెబ్ అడ్రెస్ “http: //,” తో మొదలు అవుతుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే సెక్యూరిటీ టెస్ట్ కు లోబడిన వెబ్ సైట్ లే ఈ సింబల్ ను చూపిస్తాయి. ఒకవేళ అది అక్కడ లేకపోతే ఆ వెబ్ సైట్ ను ఓపెన్ చేయకుండా ఉండడమే మంచిది.

మీ హార్డ్ వేర్ ను అమ్మేటపుడు మీ డేటా అంతటినీ డిలీట్ చేయండి.

మీ హార్డ్ వేర్ లో ఉన్న డేటా అంతా జాగ్రత్త గా డిలీట్ చేయాలి. మీరు మీ హార్డ్ వేర్ ను అమ్మాలి అనుకున్నపుడు ఈ విషయాన్ని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. మీకు సంబందించిన సమాచారం అంతటినీ డిలీట్ చేయడానికి D- ban ను ఉపయోగించుకోవచ్చు. మీ డేటా ఇంకా రహస్యం గా ఉండాలి అనుకుంటే చైన్సావ్ అనే టూల్ ను ఉపయోగించండి. ఇది మార్కెట్ లో దొరికే అత్యుత్తమ టూల్.

లింక్ లొకేషన్ ల పై ప్రత్యేక శ్రద్ద పెట్టండి.

అపరిచిత వ్యక్తుల నుండి సైట్ ల నుండీ మీకు  ఎప్పుడైనా ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా? ఇలాంటి మెసేజ్ లు, లింక్ లు మిమ్మల్ని హ్యాకర్ లకు దగ్గర చేస్తాయి. కాబట్టి అది మీకు తెలియనిది అయితే ఆ లింక్ ను ఓపెన్ చేయకుండా ఉంటేనే మంచిది. దానిలో విపరీతంగా మాల్ వేర్ మరియు స్పై వేర్ ఉండే అవకాశం ఉంటుంది. మీరు URL X- రే లాంటి టూల్ లను ఉపయోగించడం వలన ఆ లింక్ ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకునే వీలు ఉంటుంది.

ఓపెన్ వై ఫై లను ఉపయోగించకండి

మనకు సంబందించిన ముఖ్యమైన, ప్రైవేట్ డేటా తో డీల్ చేసటపుడు ఓపెన్ వైఫై ను ఉపయోగించకుండా ఉంటేనే మంచిది. ఓపెన్ వైఫై అనేది హ్యాకర్ లకు మంచి అనువైన ప్రదేశం. ఇలాంటి వైఫై లలో హ్యాకింగ్ ఎలా చేస్తారో మనం ఇంతకుముందు ఒక ఆర్టికల్ లో చదువుకున్నాం కూడా. కాబట్టి పాస్ వర్డ్ తో సెక్యూర్ గా ఉన్న ఎన్ క్రిప్టేడ్ వైఫై లనే ఉపయోగించండి.

పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్ ల దగ్గర జాగ్రత్త గా ఉండండి.

ఎయిర్ పోర్ట్ లు, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్, లేదా కేఫ్ లు లాంటి చోట్ల ఉండే పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్ ల దగ్గర మీ మొబైల్ లను కానీ ట్యాబ్ లను కానీ ఛార్జింగ్ పెట్టేటపుడు మీరు మరింత జాగ్రత్త గా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే హ్యాకర్ లు పబ్లిక్ ప్లేస్ లలో తమకు అనువుగా ఉండే ఏ ప్రదేశాన్నీ వదలరు.

క్లౌడ్ ను వాడేటపుడు జాగ్రత్త వహించండి.

మీకు సంబందించిన ప్రైవేటు మరియు ముఖ్యమైన సమాచారాన్ని క్లౌడ్ ద్వారా షేర్ చేయవద్దు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దేనినీ నమ్మడానికి లేదు. ఇంటర్ నెట్ ను అయితే మరీ నమ్మకూడదు. కాబట్టి మీ సమాచారాన్ని నెట్ లో షేర్ చేయవద్దు.

నెట్ లో ఏవైనా పోస్ట్ చేసేటపుడు తొందర పడవద్దు.

ఇంటర్ నెట్ లో ఏవైనా పోస్ట్ లు పెట్టేటపుడు తొందర పడకుండా ఒకటికి రెండు సార్లు అలోచించి పెట్టాలి. ఎందుకంటే మీరు పెట్టె పోస్ట్ లు వేరే వారిని బాదించవచ్చు , అది విపరీత పరిణామాలకు దారి తీయవచ్చు.

బ్రౌజింగ్ మరియు ఈ మెయిల్ లను వాడేటపుడు జాగ్రత్త గా ఉండండి.

మీరు ఇంటర్ నెట్ వాడేటపుడు గానీ లేదా మెయిల్ చేస్తున్నపుడు గానీ మీరు పెద్ద మొత్తం లో డబ్బు గెలుచుకున్నట్లు లేదా కార్ గెలుచుకున్నట్లు నోటిఫికేషన్ లు గమనించే ఉంటారు. ఇలాంటి వాటిని  phishing campaigns  అని అంటారు. వీటికి ఆకర్షితులు అయ్యారు అంటే ఇక మీ పని గోవిందా! అందుకనే ఈ సారి ఇలాంటి వాటిని చూసినపుడు వాటిని వెంటనే క్లోజ్ చేయండి.

స్ట్రాంగ్ పాస్ వర్డ్ లను క్రియేట్ చేసుకోండి.

స్ట్రాంగ్ పాస్ వర్డ్ లను ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మన కంప్యూటర్, టాబ్లెట్, ఫోన్ ఇలాంటి పరికరాలు వాడేటపుడు వాటికి స్ట్రాంగ్ పాస్ వర్డ్ లను సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐ ఫోన్ లకు ఫింగర్ లాక్ పాస్ వర్డ్ లను ఉపయోగించాలి. ఆండ్రాయిడ్ కు అయితే పాస్ కీ ను కానీ స్వైప్ ను కానీ ఉపయోగించాలి. మీ ఫోన్ ను పాస్ వర్డ్ లేకుండా ఉంచకూడదు అనేది బండ గుర్తు గా పెట్టుకోవాలి.

సరిగ్గా లాగ్ ఆఫ్ మరియు లాగ్ ఇన్ అవ్వండి.

మీరు ఉపయోగించడం అయిన వెంటనే మీ ఎకౌంటు నుండి లాగ్ అవుట్ అవ్వడం అనేది ఒక మంచి అలవాటు. దీనివలన మీ డేటా సురక్షంగా ఉంటుంది. మీ కంప్యూటర్ ను స్విచ్ ఆఫ్ చేసే ముందు మీ అకౌంట్ లన్నీ  లాగ్ అఫ్ చేయాలి.

మీ బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేయండి.

మీరు బ్రౌజ్ చేసిన ప్రతీ సారీ బ్రౌజింగ్ హిస్టరీ ని డిలీట్ చేయాలి. కుదరకపోతే కనీసం రోజుకి ఒక్కసారైనా మీ బ్రౌజింగ్ హిస్టరీ ని డిలీట్ చేయాలి. దీని వలన మీ ఎకౌంటు లు బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవ్వకుండా ఉంటాయి. తద్వారా మీ డేటా హ్యాకర్ ల బారిన పడకుండా ఉంటుంది.

ఫ్లాష్ డ్రైవ్ లను వాడేటపుడు జాగ్రత్త గా ఉండండి.

ఫ్లాష్ డ్రైవ్ లను థంబ్ డ్రైవ్ అని కూడా అంటారు.ఇవి స్టోరేజ్ డివైస్ లు. డాక్యుమెంట్ లను, ఫైల్ లను ఎక్స్ చేంజ్ చేసుకోవడానికి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటిద్వారా కూడా వైరస్ లు వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి వీటిని వాడేటపుడు జాగ్రత్త గా ఉండాలి.

"

జన రంజకమైన వార్తలు