ఆండ్రాయిడ్ యూజర్లకు షాకింగ్ న్యూస్. నా ఫోన్‌లో ఇంత మెగాపిక్సెల్ కెమెరా ఉంది.. నా ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.. నా ఫోన్ కెమెరాలో లైవ్ ఫోకస్ ఉంది.. అని కెమెరాలను చూసి మురిసిపోతున్నారా? అయితే మీ ఫోన్ లోని కెమెరా యాప్ మీ ప్రైవసీని బజారున పెట్టేసే ప్రమాదం ఉందని మీకు తెలుసా? అసలు ఏంటా కథ.. చూడండి.
ఎలా బయటపడిందంటే..
మీ ఆండ్రాయిడ్ సెల్ ఫోన్‌లోని కెమెరా యాప్‌ను ఉపయోగించి మీకు తెలియకుండానే మీ ఫోటోలు వీడియోలు తీసే మాల్వేర్ ఒకటి కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రవేశించింది. దీన్ని యెరెజ్ యలెన్ అనే సైబర్ సెక్యూరిటీ నిపుణుడు గుర్తించి గూగుల్‌కు సమాచారం ఇచ్చాడు. ఆండ్రాయిడ్ ఫోన్ యాప్‌లో ఈ వల్నరబులిటీకి అవకాశం ఉందని గూగుల్ కూడా అంగీకరించింది. దీన్ని క్లియర్ చేయడంపై గూగుల్ ఇప్పుడు ఫోకస్ పెట్టింది.
ఏమవుతుంది?
* ఈ మాల్వేర్ యాప్ మీ ఫోన్‌లోని ఎస్డీ కార్డ్‌ను యాక్సెస్ చేస్తుంది. దీంతో అందులో స్టోరయి ఉన్న ఫోటోలు, వీడియోలను వాడేస్తుంది.
* అంతేకాదు మీకు తెలియకుండానే కెమెరా యాప్‌తో సీక్రెట్‌గా మీ ఫోటోలు, వీడియోలు షూట్ చేస్తుంది. అప్పుడు మీ పర్సనల్
ఫోటోల నుంచి పడగ్గది వరకు ఏదైనా ఫోటోలు, వీడియోలు తీయగలిగే ప్రమాదం ఉంది.
* జీపీఎస్ లొకేషన్ డేటాను కూడా యాక్సెస్ చేస్తుంది.
* అత్యంత ప్రమాదకరమైన విషయమేమింటే మీ ఫోన్ లాక్ అయి ఉన్నా కూడా ఈ మాల్వేర్ తన పని తాను చేసుకుపోతుంది. ఫోటోలు, వీడియోలు తీసేస్తుందని యలెన్ చెబుతున్నారు.
గూగుల్, శాంసంగ్ ఫోన్లలో గుర్తింపు
ఈ మాల్వేర్‌ను గుర్తించి గూగుల్‌కు కంప్లయింట్ చేసిన యలెన్ దీన్ని గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 3 ఫోన్లలో గుర్తించారు. అంటే ఆండ్రాయిడ్ ఫోన్లలో టాప్‌గా చెప్పుకునే పిక్సెల్ ఫోన్లలోనే ఈ మాల్వేర్ ఉందంటే ఇక మామూలు ఫోన్ల పరిస్థితి ఏమిటన్న ఆందోళన యూజర్లలో రావచ్చు. పిక్సెల్ ఫోన్ల తర్వాత శాంసంగ్ ఫోన్లలోనూ ఈ మాల్వేర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ రెండు ఫోన్లలోని కెమెరా యాప్‌ను ప్రధానంగా ఈ మాల్వేర్ ఎఫెక్ట్ చేస్తుందని యలెన్ చెప్పారు.