• తాజా వార్తలు

24 గంటల్లో వన్నా క్రై కంటే డేంజరస్ సైబర్ అటాక్?


వన్నా క్రై ప్రపంచ దేశాలను ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. ఈ దెబ్బ నుంచి ఇంకా కోలుకోకముందే మరో 24 గంటల్లో మరోసారి సైబర్ అటాక్స్ జరగొచ్చని ప్రమాద హెచ్చరికలు వస్తున్నాయి. సోమవారం నాడు మరో భారీ సైబర్ దాడి జరగనుందని బ్రిటన్ సైబర్‌ నిపుణుడు డారెన్‌ హుస్‌ చెప్తున్నాడు. దీన్ని ఎదుర్కోవడం చాలా కష్టమని, వన్నాక్రై కంటే ఇది డేంజరస్ అటాక్ అని అంటున్నారు.

పాత వైరస్ ల కోడింగ్ లో మార్పులు చేసిన హ్యాకర్లు, ప్రపంచ సైబర్ సిస్టమ్ ను సర్వనాశనం చేసేందుకు ప్లాన్లు వేస్తున్నారని డారెన్ చెప్తున్నాడు.

దాదాపు 100 దేశాలను వణికించిన 'వాన్నా క్రై' నుంచి ఇప్పుడిప్పుడే పలు సంస్థలు కోలుకుంటున్నాయి. బ్రిటన్ లో 48 కంపెనీల కంప్యూటర్లు హ్యాక్ నకు గురికాగా, ఆరు కంపెనీలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. మరోవైపు వన్నా క్రైని తయారుచేసి వదిలిన హ్యాకర్లు ఈ ర్యాన్సమ్ వేర్ తో ఇప్పటికే 22 వేల డాలర్ల ఆదాయాన్ని పొందినట్టు తెలుస్తోంది.

జన రంజకమైన వార్తలు